Pakistan Drones: నెలరోజుల్లో 9 పాక్ డ్రోన్లు కూల్చివేత
ABN , First Publish Date - 2022-12-24T04:42:48+05:30 IST
దేశ సరిహద్దుల్లో అంతర్జాతీయ నియంత్రణ రేఖ వెంట 9 పాకిస్థాన్ డ్రోన్లను సరిహద్దు భద్రతా దళం కూల్చివేసింది....
చండీఘడ్ (పంజాబ్): దేశ సరిహద్దుల్లో అంతర్జాతీయ నియంత్రణ రేఖ వెంట 9 పాకిస్థాన్ డ్రోన్లను సరిహద్దు భద్రతా దళం కూల్చివేసింది.(BSF downs) అమృత్‌సర్‌లోని పుల్మోరన్ సరిహద్దు పోస్ట్ సమీపంలో శుక్రవారం పాకిస్థాన్ మానవరహిత వైమానిక వాహనం (డ్రోన్)పై బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరిపి దాన్ని కూల్చివేసింది. అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు తరచూ భారత సరిహద్దుల్లోకి వస్తున్నాయి.పాక్ డ్రోన్లు 25 కిలోలను మోసుకెళ్లగల సామర్థ్యంతో డ్రగ్స్, పేలుడు పదార్థాలను భారత్‌లోకి పంపుతున్నాయని బీఎస్ఎఫ్(Border Security Force) గుర్తించింది.
అధికారిక రికార్డుల ప్రకారం2021 వ సంవత్సరం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2022లో 24 పాక్ డ్రోన్‌లను బీఎస్ఎఫ్ కూల్చివేసింది.పాకిస్థాన్ డ్రోన్‌ల ద్వారా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, డ్రగ్స్, పేలుడు పదార్థాల అక్రమ రవాణాపై గట్టి నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. దీంతో సరిహద్దు కాపలా దళం ఈ ముప్పును ఎదుర్కోవటానికి ఇటీవల కొత్త వ్యూహాలను అనుసరించింది.డ్రోన్‌ల నుంచి వచ్చే శబ్దాలతో వాటి లక్ష్యంగా కాల్పులు జరపడం కాకుండా, సరిహద్దుల్లో జీపీఎస్ ద్వారా మ్యాప్ చేసి, క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు. హాని కలిగించే ప్రదేశాలలో పెట్రోలింగ్ పెంచామని పేరు చెప్పని ఓ సైనిక అధికారి తెలిపారు.
సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే పలు యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.సరిహద్దుల్లో నిఘా కెమెరాలు, యాంటీ డ్రోన్లు, ఇతర పర్యవేక్షణ గాడ్జెట్‌ల కోసం కేంద్రం రూ.30 కోట్ల నిధిని మంజూరు చేసిందని ఆర్మీ అధికారి చెప్పారు.ఈ ఏడాది సరిహద్దుకు సమీపంలో దాదాపు 300 డ్రోన్‌లు కనిపించాయని, డ్రోన్ ముప్పును ఎదుర్కోవడానికి హోం మంత్రిత్వ శాఖ బీఎస్ఎఫ్ కి కార్యాచరణ స్వేచ్ఛ ఇచ్చిందని మరో అధికారి తెలిపారు.
2021వసంవత్సరంలో 109, 2020లో 49, 2019వ సంవత్సరంలో 35 పాక్ డ్రోన్‌లను గుర్తించారు.లష్కరే తోయిబా (ఎల్‌ఈటి), జమ్మూ కాశ్మీర్‌లో దాని శాఖ రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్), జైష్-ఎ-మహ్మద్ (జెఎమ్) పాక్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ మద్దతుతో ఉన్న ఖలిస్తానీ సంస్థలు చైనా డ్రోన్‌లను ఉపయోగిస్తున్నాయి. అమృత్‌సర్, జలంధర్, గురుదాస్‌పూర్, ఫిరోజ్‌పూర్మ్ కథువా, ఆర్‌ఎస్ పురా, కనాచక్ మీదుగా పాక్ డ్రోన్లను పంపుతున్నాయని భద్రతా సంస్థలు వివరించాయి.