Chandigarh: పొగమంచు కారణంగా 4 విమానాల రద్దు, ఆలస్యంగా విమానాల రాకపోకలు
ABN , First Publish Date - 2022-12-22T06:38:28+05:30 IST
పంజాబ్ రాష్ట్రంలోని చండీఘడ్‌లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా చండీఘడ్‌లో నాలుగు విమానాలు....
చండీగఢ్(పంజాబ్): పంజాబ్ రాష్ట్రంలోని చండీఘడ్‌లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దట్టమైన పొగమంచు కారణంగా చండీఘడ్‌లో నాలుగు విమానాలు రద్దు చేశారు.(Flights Cancelled Due to Fog) చండీఘడ్ నుంచి బయలుదేరే 15 విమానాలు, 13 అరైవల్ విమానాలు సహా మొత్తం 28 విమాన సర్వీసులు బుధవారం రాత్రి వరకు ఆలస్యం అయ్యాయి.(Delayed Due to Fog)పొగమంచు కారణంగా విజిబిలిటీ 100 మీటర్లకు పడిపోయింది.రాబోయే రోజుల్లో ఒక మోస్తరు నుంచి దట్టమైన పొగమంచు కొనసాగుతుందని, ముఖ్యంగా అర్థరాత్రి, తెల్లవారుజామున పొగమంచు ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.
చండీఘడ్‌లో(Chandigarh) పొగమంచు కారణంగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి.మంగళవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 7.8డిగ్రీల సెల్షియస్ నుంచి బుధవారం 9.2డిగ్రీల సెల్షియస్ కి పెరిగింది.రద్దు చేసిన విమానాల్లో(Flights Cancelled) ఉదయం 6 గంటలకు ఇక్కడికి చేరుకోవాల్సిన ఢిల్లీ-చండీగఢ్ విమానం ఉంది. ఉదయం 11:15 గంటలకు ల్యాండ్ కావాల్సిన లేహ్ విమానం, మధ్యాహ్నం 2:55 గంటలకు ఇక్కడికి చేరుకోవాల్సిన లక్నో విమానం, ఢిల్లీ నుంచి మరో విమానం రద్దు అయ్యాయి. రద్దు చేసిన విమానాలు సాయంత్రం 04:10 గంటలకు ఇక్కడకు చేరుకోవడానికి షెడ్యూల్ చేశారు.