Home » Chandigarh
హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మన రాష్ట్రంలో మూడు నెలల్లో 667 మంది చనిపోయారు. దీనిపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తూ, హెల్మెట్ లేనివారిపై కఠిన చర్యలు అవసరమని నొక్కిచెప్పింది.
కుస్తీ యోధురాలు, ట్రిపుల్ ఒలింపియన్ వినేశ్ ఫొగట్ హరియాణా ఎన్నికల సమరంలో మాత్రం ఓ ‘పట్టు’ పట్టారు. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్‌లో దురదృష్టవశాత్తు తృటిలో పతకం చేజారినా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు.
జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం ప్రకారం జమిలి ఎన్నికలు సాధ్యంకావని తెలిపారు.
హరియాణాలో నిరుద్యోగ తీవ్రతకు ఇదో నిదర్శనం. ప్రభుత్వ విభాగాలు, కార్పొరేషన్లలో స్వీపర్ పోస్టుల కోసం సుమారు 1.7 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
దెయ్యాన్ని వదిలిస్తానంటూ పంజాబ్‌లో ఓ పాస్టరు చేసిన చికిత్స ‘వికటించింది.’ దెయ్యాన్ని పారదోలడం పేరుతో అతడు కొట్టిన దెబ్బలకు 30 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహకాలను సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ ఆ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సారథ్యంలోని ఈసీఐ బృందం సోమవారంనాడు చండీగఢ్ చేరుకుంది.
చండీగఢ్ కోర్టులో శనివారంనాడు అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కుటుంబ వివాదాల కారణంగా కోర్టుకు వచ్చిన అల్లుడిపై సొంత మామయ్య కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధితుడు ప్రాణాలు కోల్పోగా, హంతకుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పంజాబ్‌లో విశ్వహిందూ పరిషత్ (VHP) నేత వికాస్ ప్రభాకర్ హత్య కేసులో ఇద్దరు నిందితుల ఫొటోలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మంగళవారం విడుదల చేసింది. వీరు ఎక్కడున్నా ప్రాణాలతో పట్టిస్తే రూ.10 లక్షల నగదు ఇస్తామని ప్రకటించింది.
టాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై పంజాబ్ ఎయిర్‌పోర్ట్‌లో మహిళా కానిస్టేబుల్ దాడి చేసింది. ఈ ఘటనపై పంజాబ్ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ సింగ్ మాన్ సోమవారం స్పందించారు.
ప్రజాధనంతో చండీగఢ్ అధికారులు జోరుగా షికార్లు చేశారు. ప్యారిస్ టూర్ వెళ్లి తెగ ఎంజాయ్ చేశారు. ఎకానమీ కాకుండా బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకొని వెళ్లారు. ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్లో బస చేశారు. ఆ సమయంలో ఖర్చు గురించి ఆలోచించలేదు. ముగ్గురు అధికారులు కలిసి ప్రజాధనాన్ని దుబారా చేశారు.