Bharat Jodo yatra: జాతీయజెండా పట్టుకుని నడుస్తూ కాంగ్రెస్ నేత కన్నుమూత

ABN , First Publish Date - 2022-11-08T19:17:17+05:30 IST

ముంబై: రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' ) 62వ రోజైన మంగళవారంనాడు విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ సేవాదళ్ నేత కృష్ణ కుమార్ పాండే..

Bharat Jodo yatra: జాతీయజెండా పట్టుకుని నడుస్తూ కాంగ్రెస్ నేత కన్నుమూత

ముంబై: రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' (Bharat Jodo Yatra) 62వ రోజైన మంగళవారంనాడు విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ సేవాదళ్ నేత కృష్ణ కుమార్ పాండే (Krishna Kumar Pandey) యాత్రలో పాల్గొంటూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

jodo2.jpg

''భారత్ జోడో యాత్ర 62వ రోజు ఉదయం సేవాదళ్ ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్ పాండే జాతీయ జెండా పట్టుకుని నాతో కలిసి నడిచారు. కొద్ది సేపటికి ఆయన తన చేతిలోని జెండాను పక్కనే ఉన్న తన సన్నిహితుడికి ఇచ్చి వెనక్కి మళ్లారు. ఆ తర్వాత అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించాం. అయితే దురదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన ఎంతో నిబద్ధత కలిగిన అసలు సిసలు కాంగ్రెస్ వాది. యాత్రలో పాల్గొంటున్న వారంతా ఆయనకు గౌరవాదరాలతో శ్రద్ధాంజలి ఘటించాల్సిన తరుణం ఇది'' అని ఆ ట్వీట్‌లో జైరామ్ రమేష్ తెలిపారు.

jodi1.jpg

నాందేడ్ జిల్లా అట్కాలి గ్రామంలో యాత్ర ఆగిన వెంటనే కృష్ణకుమార్ పాండేకు యాత్రలో పాల్గొన్న వారు, మహారాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు, రాహుల్ గాంధీ నివాళులర్పించినట్టు చెప్పారు. కృష్ణకుమార్ పాండే అంతిమయాత్ర ఫోటోను జైరామ్ రమేష్ మరో ట్వీట్‌లో పోస్ట్ చేశారు. "ఇది బహుశా కృష్ణకుమార్ పాండే చివరి ఫోటో. జాతీయ పతాకం పట్టుకుని చెక్కుచెదరని చిరునవ్వుతో యాత్రలో నడక సాగించారు. సెల్యూట్...''అంటూ ట్వీట్ చేశారు.

Updated Date - 2022-11-08T19:17:23+05:30 IST