Haryana : ప్రభుత్వోద్యోగులు ప్రజల కోసం పని చేయాలి : సీఎం ఖత్తార్

ABN , First Publish Date - 2022-11-08T14:09:45+05:30 IST

హర్యానాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకే బాండ్ విధానాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి

Haryana : ప్రభుత్వోద్యోగులు ప్రజల కోసం పని చేయాలి : సీఎం ఖత్తార్

న్యూఢిల్లీ : హర్యానాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకే బాండ్ విధానాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తార్ (Manohar Lal Khattar) చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వైద్యులు ఏడేళ్ళపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేయాలని తెలిపారు. ఈ గడువు కన్నా ముందుగానే వెళ్లిపోవాలనుకుంటే, వారు బాండ్లను సమర్పించవలసి ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఆయన సోమవారం కర్ణాల్‌లో విలేకర్లతో మాట్లాడారు.

ప్రభుత్వోద్యోగులు ప్రజల కోసం పని చేయాలని, లాభాల కోసం కాదని అన్నారు. పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకోలేరని, కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఈ బాండ్ పాలసీ దోహదపడుతుందని తెలిపారు. ప్రతిపక్షాలు వైద్య విద్యార్థులను తప్పుదోవపట్టిస్తున్నాయని మండిపడ్డారు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత ఉద్యోగం రాకపోతే, బాండ్ ఫీజును చెల్లించవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-08T14:09:49+05:30 IST