Home » Manohar Lal Khattar
ఢిల్లీ పర్యనటలో భాగంగా ఇవాళ (మంగళవారం) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులను కేంద్ర మంత్రి దృష్టికి నారాయణ తీసుకెళ్లారు.
ఒక్కోసారి అనుకోకుండా అదృష్టం కలిసివస్తుందంటే ఏమో అనుకుంటాం. సరిగ్గా హర్యానా విషయంలో ఇదే జరిగింది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది.
ప్రధాని మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకర కార్యక్రమం ఢిల్లీలోని రాష్ర్టపతి భవన్‌లో ఘనంగా జరుతోంది. మోదీ మంత్రి వర్గంలో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు భాగం కానున్నారు.
స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో హరియాణాలోని(Haryana) బీజేపీ సర్కార్ మైనారిటీలో పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
హర్యానాలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసిన అనంతరం రాజీనామా చేశారు. ఆయన బాటలోనే క్యాబినెట్ మంత్రులు కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న దుశ్యంత్ చౌతాలా సారధ్యంలోని జేజేపీతో లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు రావడం ఈ పరిస్థితికి కారణమైంది.
Toxic Liquor: హరియాణా(Haryana)లో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. కల్తీ మద్యం(Toxic Liquor)సేవించి తాజాగా 19 మంది మృతి చెందడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనకు ప్రధాన నిందితులుగా గుర్తిస్తూ 7 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్(Congress) పార్టీ అంటేనే కట్, కమీషన్, కరప్షన్ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amithshah) విమర్శించారు. హరియాణా(Haryana) ప్రభుత్వం గురువారం నిర్వహించిన అంత్యోదయ సమ్మేళన్ లో షా ప్రసంగించారు. కాంగ్రెస్ అవినీతి పార్టీ అని.. 27 పార్టీలు తమ స్వప్రయోజనాల కోసమే కాంగ్రెస్ తో జతకట్టాయని అన్నారు.
ఛండీగఢ్: హర్యానా (Haryana)లోని బీజేపీ (BJP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ ఏ, బీ (Group A, B) ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో షెడ్యూల్డ్ కులాల (SC) వారికి 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ (Manohar Lal Khattar) ప్రకటించారు. సోమవారంనాడు అసెంబ్లీలో ఆయన ఈ ప్రకటన చేశారు.
హర్యానాలోని నుహ్ జిల్లాలో ఇటీవల మత ఘర్షణలు జరిగిన నేపథ్యంలో అక్రమ కట్టడాల కూల్చివేత నాలుగో రోజు కూడా కొనసాగింది. ఆదివారం ఉదయం నుహ్‌లోని ఓ హోటల్ కమ్ రెస్టారెంట్‌ను అధికారులు కూల్చేశారు. దీనిని చట్టవిరుద్ధంగా నిర్మించారని అధికారులు తెలిపారు.
హర్యానాలోని నుహ్ జిల్లాలో అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమం కొనసాగుతోంది. నల్హర్‌లోని షహీద్ హసన్ ఖాన్ మేవాతీ ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద ఉన్న దాదాపు 20 మెడికల్ స్టోర్స్‌ను అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. వీటిని ప్రభుత్వ భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించినట్లు అధికారులు తెలిపారు.