Joe Biden : ఎలన్ మస్క్‌పై జో బైడెన్ ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-11-05T14:00:21+05:30 IST

సామాజిక మాధ్యమ కంపెనీ ట్విటర్‌ను కొనడానికి ఎలన్ మస్క్ (Elon Musk) తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా

Joe Biden : ఎలన్ మస్క్‌పై జో బైడెన్ ఘాటు వ్యాఖ్యలు
Joe Biden

వాషింగ్టన్ : సామాజిక మాధ్యమ కంపెనీ ట్విటర్‌ను కొనడానికి ఎలన్ మస్క్ (Elon Musk) తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) విమర్శించారు. ప్రపంచానికి అబద్ధాలను పంపిస్తూ, అబద్ధాలను వెదజల్లే సంస్థను ప్రపంచంలో అత్యంత సంపన్నుడు మస్క్ కొన్నారని వ్యాఖ్యానించారు. చికాగోలో శుక్రవారం నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ఇప్పుడు మనందరి ఆందోళన దేనికి? ప్రపంచవ్యాప్తంగా అబద్ధాలను పంపిస్తూ, వెదజల్లుతున్న సంస్థను ఎలన్ మస్క్ కొన్నారు. ఎడిటర్స్ ఇక ఉండరు. ఏది ప్రమాదకరమో అర్థం చేసుకోగలిగే శక్తి పిల్లలకు ఉంటుందని ఎలా ఆశించగలం?’’ అని బైడెన్ చెప్పారు.

ట్విటర్‌ను ఎలన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొన్నారు. ఆ సంస్థలో పని చేసే సుమారు 7,500 మంది ఉద్యోగుల్లో దాదాపు సగం మందిని శుక్రవారం ఉద్యోగాల నుంచి తొలగించారు. యూజర్లు బ్లూ టిక్ వెరిఫికేషన్ కోసం 8 డాలర్లు చెల్లించాలని ప్రకటించారు. అయితే తప్పుడు సమాచారాన్ని నిరోధించేందుకు నియమితులైన ఉద్యోగుల బృందంలో చాలా తక్కువ మందిని మాత్రమే తొలగించినట్లు ట్విటర్ వెల్లడించింది. ఇదిలావుండగా, భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించేందుకు అవకాశాన్ని పునరుద్ధరిస్తామని మస్క్ ప్రకటించారు.

Updated Date - 2022-11-05T14:00:26+05:30 IST