kangana Ranaut: రాజకీయాల్లోకి కంగనా రనౌత్..!
ABN , First Publish Date - 2022-10-29T17:15:40+05:30 IST
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranut) రాజకీయాల్లో (politics) రానున్నారా? అందుకు సుముఖంగా ఉన్నట్టు కంగన సంకేతాలిచ్చారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే రాజకీయాల్లో చేరతానని, ఇది తన అదృష్టంగా భావిస్తానని 'ఇండియా టుడే కాంక్లేవ్'లో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కంగన తెలిపారు.
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranut) రాజకీయాల్లో (politics) రానున్నారా? అందుకు సుముఖంగా ఉన్నట్టు కంగన సంకేతాలిచ్చారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే రాజకీయాల్లో చేరతానని, ఇది తన అదృష్టంగా భావిస్తానని 'ఇండియా టుడే కాంక్లేవ్'లో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కంగన తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తనకు టిక్కెట్ ఇస్తే రాజకీయాల్లోకి చేరడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు ఆమె సూటిగా సమాధానమిచ్చారు.
త్వరలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా కంగన మాట్లాడుతూ, ఆమ్ ఆద్మీ పార్టీ బూటకపు వాగ్దానాలను ప్రజలు నమ్మరని, హిమాచల్ ప్రదేశ్‌లో ఆప్ ''ఉచితాలు'' పనిచేయవని అన్నారు. కాగా, నటిగా కంగనా ప్రస్తుతం 'ఎమర్జెన్సీ' చిత్రంలో కనిపించనున్నారు. ఇందులో ఇందిరాగాంధీ పాత్రను ఆమె పోషించనున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది.