Kanhaiya Kumar: ప్రగ్యా థాకూర్‌ వ్యాఖ్యలపై కన్నయ్యకుమార్ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-12-29T07:55:48+05:30 IST

విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ బీజేపీ ఎంపీ ప్రగ్యా థాకూర్‌ పై కాంగ్రెస్ నాయకుడు కన్నయ్యకుమార్ మండిపడ్డారు...

Kanhaiya Kumar: ప్రగ్యా థాకూర్‌ వ్యాఖ్యలపై కన్నయ్యకుమార్ ఆగ్రహం
Kanhaiya Kumar On Pragya Thakur

ముంబయి : విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ బీజేపీ ఎంపీ ప్రగ్యా థాకూర్‌ పై కాంగ్రెస్ నాయకుడు కన్నయ్యకుమార్ మండిపడ్డారు.(Kanhaiya Kumar) మహారాష్ట్రలోని ముంబయి నగరంలో కాంగ్రెస్ 138వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో కన్హయ్య కుమార్ ప్రసంగించారు.‘‘హిందువులూ మీ ఇళ్లలో కత్తులనైనా పదునుగా చేసుకుని ఉంచుకోండి. ప్రతి ఒక్కరికి ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉంది’’(Knives Remark) అని బీజేపీ ఎంపీ ప్రగ్యా థాకూర్‌(BJP MP Sadhvi Pragya Thakur) చేసిన వ్యాఖ్యలపై కన్నయ్య కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధర్మపరులు ఎప్పుడూ హింస గురించి మాట్లాడరని, ద్వేషపూరిత ప్రసంగాలు చేయరని కన్నయ్య చెప్పారు. ‘‘సాధ్వి ప్రగ్యా థాకూర్‌ పూర్తిగా విరుద్ధంగా చేస్తోంది, ఇంట్లో పదునైన కత్తులు ఉంచుకోమని ప్రజలను కోరుతోంది. ఆమె ఏ రకమైన సాథ్వీ, నాకు అర్థం కావడం లేదు’’ అని కన్నయ్య వ్యాఖ్యానించారు.హింస గురించి మాట్లాడటం ద్వారా దేశ భద్రతకు భరోసా ఇవ్వడమే కర్తవ్యంగా ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ప్రగ్యాఠాకూర్ అపహాస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కుమార్ అన్నారు.

సాథ్వీ ప్రగ్యా దేశ హోం శాఖమంత్రిని ఎగతాళి చేయడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను ప్రశంసించిన ఆయన, రాహుల్ గాంధీ జాతి పునాదిని, సోదరభావాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చారని అన్నారు.ఓ ఎంపీ ఇలాంటి ప్రకటనలు చేయడం దురదృష్టకరమని, ఆమె ఇప్పటికే తీవ్రవాద కేసులో నిందితురాలిగా ఉన్నారని, కర్ణాటక ఎందుకు ఇలాంటి వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందో తెలియడం లేదని, దీనిపై చట్టపరంగా ఫిర్యాదు చేస్తామని కన్నయ్య చెప్పారు.

Updated Date - 2022-12-29T07:55:49+05:30 IST