PM Modi : బెంగాల్ పర్యటన రద్దు...అహ్మదాబాద్ బయలుదేరిన మోదీ
ABN , First Publish Date - 2022-12-30T07:07:25+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన తల్లి హీరాబెన్ మృతితో శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ కు బయలుదేరారు...
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన తల్లి హీరాబెన్ మృతితో శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ కు బయలుదేరారు.(Mother Heeraben Demise)శుక్రవారం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వందేభారత్ రైలు ప్రారంభోత్సవంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా, ఆ పర్యటనను మోదీ రద్దు చేసుకున్నారు.(PM Modi) తన తల్లి హీరాబెన్ మృతి వార్తను మోదీ ట్వీట్ ద్వారా తెలిపారు. హీరాబెన్ మోదీ శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మరణించినట్లు అహ్మదాబాద్(Ahmedabad) నగరంలోని యుఎన్ మెహతా హార్ట్ హాస్పిటల్ విడుదల చేసిన బులెటిన్‌లో ప్రకటించింది.
తన తల్లి హీరాబెన్ ఒక సన్యాసిగా, నిస్వార్థ కర్మయోగిగా, విలువలకు కట్టుబడి జీవితం సాగించిందని మోదీ ట్వీట్ చేశారు. ఎల్లప్పుడూ తెలివిగా పనిచేయాలని, స్వచ్ఛమైన జీవితం గడపాలని తనకు తల్లి 100వ పుట్టినరోజు సందర్భంగా చెప్పినట్లు మోదీ గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం 7.30 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటారు.ఈ ఏడాది జూన్‌లో తన తల్లి 99వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఒక బ్లాగ్ రాశారు. అందులో ఆమె జీవితంలోని వివిధ కోణాలను ఆవిష్కరించారు.