Gujarat Elections Results: గుజరాత్ ఫలితాలపై మోదీ ఎమన్నారంటే?

ABN , First Publish Date - 2022-12-08T19:46:13+05:30 IST

బీజేపీ దేశం కోసం కఠినమైన, పెద్ద నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

Gujarat Elections Results: గుజరాత్ ఫలితాలపై మోదీ ఎమన్నారంటే?
Prime Minister Narendra Modi

న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (Gujarat, Himachal Assembly Elections) ఫలితాలు వచ్చాక న్యూఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కి ఘన స్వాగతం లభించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఆయనకు గజమాల వేశారు.

అనంతరం కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వాన్ని మెచ్చుకున్నారు. యూపీ రాంపూర్‌లో బీజేపీ అభ్యర్థి గెలిచారని చెప్పారు. ఎన్నికల సంఘం అధికారులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఒక్క పోలింగ్ బూత్‌లో కూడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లేశారని మోదీ చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో గెలుపోటముల మధ్య ఒక్క శాతం మాత్రమే తేడా ఉందన్నారు. ఒక్క శాతం తేడాతో ఓడిపోయినా హిమాచల్ ప్రదేశ్ అభివృద్ధికి వంద శాతం సహకరిస్తామని చెప్పారు. భారత్ అమృత్‌కాలంలో ప్రవేశించిన తరుణంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు ద్వారా బీజేపీని ఆదరించారని మోదీ చెప్పారు. బీజేపీ దేశం కోసం కఠినమైన, పెద్ద నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. బంధుప్రీతి, అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని చెప్పారు. గుజరాత్‌ ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి బీజేపీకి చారిత్రక విజయం అందించారని మోదీ చెప్పారు. జాతి, కుల, మతాలకు అతీతంగా బీజేపీకి ఓట్లు వేశారని చెప్పారు. భరోసా కలగడం వల్లే యువత బీజేపీకి ఓట్లేసిందని మోదీ చెప్పారు. విజన్‌తో పాటు, వికాసం కూడా సాధించగలిగే శక్తి సామర్థ్యాలుండటం వల్లే యువత బీజేపీకి ఓట్లేసిందన్నారు. దేశానికి క్లిష్టమైన సవాళ్లు ఎదురైతే పరిష్కారం కోసం దేశ ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారని మోదీ చెప్పారు. దేశమే తొలి ప్రాధాన్యమనే సంకల్పంతో బీజేపీ పనిచేస్తుందని మోదీ చెప్పారు. మహిళలు, దళితులు, ఆదివాసీలు పెద్ద ఎత్తున బీజేపీకి ఓటేశారన్నారు.

అంతకు ముందు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన జేపీ నడ్డా గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. చారిత్రక విజయాన్ని అందించారని ప్రశంసలు కురిపించారు. హిమాచల్ ప్రదేశ్, ఎంసీడీ ఓటర్లకు కూడా నడ్డా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తాము నిజాయితీపరులమని చెప్పుకుంటున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ఆయన చురకలంటించారు. తప్పుదోవ పట్టించేందుకు ఆప్ నేతలు చేసిన యత్నాలను ప్రజలు తిప్పికొట్టారని నడ్డా చెప్పారు.

Updated Date - 2022-12-08T20:10:08+05:30 IST