Rivaba Jadeja: నామినేషన్ దాఖలు చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య
ABN , First Publish Date - 2022-11-14T18:36:46+05:30 IST
క్రికెటర్ రవీంద్ర జడేజా (Cricketer Ravindra Jadeja) భార్య రివబా జడేజా (Rivaba Jadeja) జామ్‌నగర్ నార్త్ (Jamnagar North)నుంచి బీజేపీ (BJP) అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
గాంధీనగర్: క్రికెటర్ రవీంద్ర జడేజా (Cricketer Ravindra Jadeja) భార్య రివబా జడేజా (Rivaba Jadeja) జామ్‌నగర్ నార్త్ (Jamnagar North)నుంచి బీజేపీ (BJP) అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో రవీంద్ర జడేజా ఆమె వెంటే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అడుగుజాడల్లో నడుస్తోన్న రివబా ఎమ్మెల్యేగా గెలుస్తుందని రవీంద్ర జడేజా ఆశాభావం వ్యక్తం చేశారు. రివబాకు ప్రజాసేవ అంటే ఇష్టమని, అందుకే ఆ రంగాన్ని ఎంచుకున్నారని చెప్పారు.
అంతకు ముందు తన భార్యకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలంటూ రవీంద్ర జడేజా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు, జామ్ నగర్ నార్త్ వాసులకు పిలుపునిచ్చారు.
రవీంద్ర జడేజా సోదరి నైనా జడేజా (Naina Jadeja) కాంగ్రెస్ (Congress) పార్టీ తరపున జామ్‌నగర్ నార్త్ (Jamnagar North) నియోజకవర్గం నుంచే పోటీపడతారని సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న నైనా జడేజాకు జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గంలో టికెట్ దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. నైనా జడేజాకు కాంగ్రెస్ సీటు ఖరారైతే ఆసక్తికర పోరు తప్పదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
182 మంది సభ్యులున్న గుజరాత్ అసెంబ్లీ (Gujarat Assembly Elections 2022) కి డిసెంబర్ ఒకటి, ఐదో తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 8న ఫలితాలు వెలువడతాయి.