Savarkars insult : రాహుల్‌గాంధీకి సీఎం ఏక్‌నాథ్ షిండే హెచ్చరిక
ABN , First Publish Date - 2022-11-17T12:05:34+05:30 IST
మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్‌గాంధీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) తాజాగా హెచ్చరిక...
ముంబయి(మహారాష్ట్ర): మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్‌గాంధీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) తాజాగా హెచ్చరిక(Warns) జారీ చేశారు.సావర్కర్ పై రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. హిందూత్వ సిద్ధాంతకర్తను అవమానిస్తే రాష్ట్ర ప్రజలు సహించరని సీఎం అన్నారు.శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే 10వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సింపోజియంలో సావర్కర్‌ను అవమానిస్తే మహారాష్ట్ర(Maharashtra) ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోరని షిండే హెచ్చరించారు.
దివంగత సమరయోధుడిని అవమానించినందుకు రాష్ట్రంలో భారత్ జోడో యాత్రను నిలిపివేయాలని షిండే నేతృత్వంలోని శివసేన (బాలాసాహెబ్)కి అనుబంధంగా ఉన్న లోక్‌సభ ఎంపీ రాహుల్ షెవాలే డిమాండ్ చేశారు.గత వారం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాకరే భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.