Home » Eknath Shinde
అధికార మహాయుతి కూటమి, విపక్ష మహా వికాస్ అఘాడి మధ్య పోటీ నువ్వా-నేనా అనే రితిలో ఉండనుండదనే అంచనాల మధ్య ప్రధానంగా 5 నియోజకవర్గలపైనే అందరి దృష్టి నెలకొంది. ఇక్కడ పోటీ మహా సంగ్రామాన్నే తలపించనుందని చెబుతున్న ఆ నియోజకవర్గాలపై ఓ ఫోకస్.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంపై ఈసీ ఘట్టి నిఘా వేసింది. ప్రచారంలో పాల్గొంటున్న ఏ ఒక్క నేతను వదిలిపెట్టకుండా అధికారులు వారి బ్యాగేజీలను తనిఖీ చేస్తున్నారు.
ఎన్సీపీ, శివసేనలో చీలికల తర్వాత మొదటిసారి శాసనసభ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. పార్టీ చీలికల తర్వాత మహారాష్ట్ర రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. శివసేనలోని ఒక వర్గానికి ఏక్నాథ్ షిండే నేతృత్వం వహిస్తుండగా, మరో వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం వహిస్తున్నారు. ఎన్సీపీ కూడా శరద్ పవార్, అజిత్ పవార్‌గా విడిపోయాయి. ఒకే పార్టీ రెండుగా చీలిపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో..
'ఇంపోర్ట్ మాల్' అంటూ సావంత్ మాట్లాడటంపై షైన ఎన్సీ అభ్యంతరం తెలిపారు. మహిళల గౌరవంపై జరుపుతున్న దాడిగా దీనిని పేర్కొన్నారు. శివసేన (యూబీటీ) నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశించారు. గతంలో సావంత్ తనను కూడా ప్రచారం కోసం తీసుకువెళ్లారని గుర్తుచేశారు.
ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌ను ఓడించగా, మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పవార్ వర్సెస్ పవార్ (అజిత్ పవార్-యుగేంద్ర పవార్) మధ్య బారామతిలో ఆసక్తికరమైన పోటీ నెలకొంది.
జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకేసు నిందితుడు శ్రీకాంత్ పాంగార్కర్ ను పార్టీలోకి చేర్చుకుని ప్రచార బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వ్యక్తం కావడంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే 'యూ టర్న్' తీసుకున్నారు.
అధికార మహాయుతి ముందుగా సీఎం అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు రావాలంటూ ఎంవీఏ సవాలు విసిరిన నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తొలిసారి స్పందించారు.
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన బద్లాపూర్ పాఠశాలలో జరిగిన అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న అక్షయ్ షిండే సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు.
విమానాశ్రయం పేరు మార్పుతో సహా సోమవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై మహారాష్ట్ర సీఎం షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.