Trains Running Late: కమ్ముకున్న పొగమంచు...ఆలస్యంగా రైళ్ల రాకపోకలు
ABN , First Publish Date - 2022-12-29T11:29:37+05:30 IST
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం ఉదయం పొగమంచు కమ్ముకుంది. పొగమంచు ప్రభావం వల్ల పలు రైళ్లు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి....
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం ఉదయం పొగమంచు కమ్ముకుంది. పొగమంచు ప్రభావం వల్ల పలు రైళ్లు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి.(Several Trains) దీంతో రైలు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. హైదరాబాద్-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్,కల్కా-హౌరా నేతాజీ ఎక్స్‌ప్రెస్, గయ-న్యూఢిల్లీ మహబోధి ఎక్స్‌ప్రెస్, పూరి-న్యూఢిల్లీ పురుషోత్తం ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటన్నర పాటు ఆలస్యంగా నడిచాయని(Running Late) రైల్వే అధికారులు చెప్పారు. బరౌనీ -న్యూఢిల్లీ స్పెషల్, అయోధ్య కంటోన్మెంట్- ఢిల్లీ ఎక్స్‌ప్రెస్, రాయగిరి-న్యూఢిల్లీ శ్రమజీవి ఎక్స్‌ప్రెస్, ప్రతాప్ ఘడ్-న్యూఢిల్లీ పద్మావత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిర్ణీత సమయం కంటే 1.45 గంటల పాటు ఆలస్యం అయ్యాయి.
రాయగడ్-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్, జబల్ పూర్-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మూడున్నర గంటల పాటు ఆలస్యంగా నడిచాయి. లక్నో-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్, ఆనందవిహార్ సద్భావన ఎక్స్‌ప్రెస్, హౌరా-న్యూఢిల్ీ పూర్వ ఎక్స్‌ప్రెస్, ముజఫర్ పూర్ -ఆనందవిహార్ ఎక్స్‌ప్రెస్ లు కూడా ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. దట్టమైన పొగమంచు(Due to Fog) కమ్ముకోవడం వల్ల రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారి చెప్పారు. ఢిల్లీలో చలితోపాటు పొగమంచు ప్రభావం వల్ల 100 విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు.