Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2022-12-11T15:19:17+05:30 IST

కాంగ్రెస్ నేత సుఖ్వీందర్ సింగ్ సుఖు (Sukhwinder Singh Sukhu) ఆదివారం హిమాచల్ ప్రదేశ్

Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రమాణ స్వీకారం
Sukhwinder Singh Sukhu

సిమ్లా : కాంగ్రెస్ నేత సుఖ్వీందర్ సింగ్ సుఖు (Sukhwinder Singh Sukhu) ఆదివారం హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఆ పార్టీ నేత ముఖేశ్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం చేశారు. సుఖు రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా గతంలో పని చేశారు. అగ్నిహోత్రి గతంలో శాసన సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.

సిమ్లాలోని రిడ్జ్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra), రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) హాజరయ్యారు. ముఖేశ్ అగ్నిహోత్రి మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మొదటి కేబినెట్ సమావేశంలోనే నెరవేర్చుతామని చెప్పారు. పాత పింఛను పథకాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలోనూ అధికారం చేపట్టబోదని గతంలో అనేవారని, అయితే తాము బీజేపీ రథాన్ని ఆపామని చెప్పారు.

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభ వీరభద్ర సింగ్‌‌తో విలేకర్లు మాట్లాడుతూ, ‘‘మీ కుమారుడు, సిమ్లా గ్రామీణ నియోజకవర్గం ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్‌కు మంత్రి పదవి లభిస్తుందా?’’ అని అడిగినపుడు ఆమె సమాధానం చెప్తూ, ‘‘దాదాపుగా’’ అన్నారు. విక్రమాదిత్య మాట్లాడుతూ, ప్రజలు తమపై నమ్మకం ఉంచారన్నారు. తాము ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చవలసి ఉందని, కలిసికట్టుగా పని చేయవలసి ఉందని చెప్పారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు.

Updated Date - 2022-12-11T15:19:22+05:30 IST