జకీర్ నాయక్‌ను మేం పిలవలేదు!
ABN , First Publish Date - 2022-11-24T01:34:00+05:30 IST
ఫిఫా ప్రపంచకప్ పోటీలను వీక్షించేందుకు వివాదాస్పద పీస్ టీవీ వ్యవస్థాపకుడు, ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్‌ఎఫ్) అధినేత
భారత్‌తో బంధాన్ని చెడగొట్టేందుకు దుష్ప్రచారం : ఖతార్
న్యూఢిల్లీ, నవంబరు 23: ఫిఫా ప్రపంచకప్ పోటీలను వీక్షించేందుకు వివాదాస్పద పీస్ టీవీ వ్యవస్థాపకుడు, ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్‌ఎఫ్) అధినేత జకీర్‌నాయక్ హాజరు కావడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మతపరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పాటు సమాజంలో శాంతికి భగ్నం కలిగిస్తున్నారని భావించిన కేంద్ర హోం శాఖ ఐఆర్‌ఎ్‌ఫపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఆయన 2016లో భారత్ నుంచి పారిపోయి మలేషియాలో ఉంటున్నారు. ఇదిలావుంటే, ఖతార్‌లోని దోహాలో జరగుతున్న ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభ వేడుకల్లో జకీర్ వీవీఐపీ గ్యాలరీలో కూర్చున్న దృశ్యాలు టీవీల్లో కనిపించాయి. దీంతో భారత్ మండిపడింది. ‘‘జకీర్‌ను ఆహ్వానించారా? అయితే, దోహాకు వచ్చిన ఉపరాష్ట్రపతిని తక్షణమే వెనక్కి పిలుస్తాం.’’ అని అల్టిమేటం జారీ చేసింది. దీనిపై స్పందించిన ఖతార్ ప్రభుత్వం అతడిని తాము ఆహ్వానించలేదని, ఎవరో ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వివరణ పంపింది.