Kuwait: వరుస తనిఖీలతో వలసదారులను బెంబేలేత్తిస్తున్న కువైత్.. 9,517 మంది దేశ బహిష్కరణ..!

ABN , First Publish Date - 2022-12-24T12:05:57+05:30 IST

గత కొంతకాలంగా కువైత్ (Kuwait) వరుస తనిఖీలతో వలసదారులను (Expats) బెంబేలేత్తిస్తోంది.

Kuwait: వరుస తనిఖీలతో వలసదారులను బెంబేలేత్తిస్తున్న కువైత్.. 9,517 మంది దేశ బహిష్కరణ..!

కువైత్ సిటీ: గత కొంతకాలంగా కువైత్ (Kuwait) వరుస తనిఖీలతో వలసదారులను (Expats) బెంబేలేత్తిస్తోంది. అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior), పోలీస్ విభాగం సంయుక్తంగా చేపడుతున్న సోదాలు ప్రవాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇక తనిఖీల సందర్భంగా ఉల్లంఘనదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరించడం (Deported) చేస్తోంది. ఇదే కోవలో ఇటీవల నిర్వహించిన తనిఖీల ద్వారా ఏకంగా 9,517 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించింది. ఆగస్టు నుంచి నవంబర్ వరకు నాలుగు నెలల వ్యవధిలో ఇలా భారీ మొత్తంలో వలసదారులను కువైత్ అధికారులు దేశం నుంచి గెంటేశారు. వేర్వేరు వర్క్ సెక్టార్లకు చెందిన వీరిలో చాలా మంది కార్మిక, రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వారు ఉన్నారట. ఒక్క నవంబర్ మాసంలోనే 1,065 మందిపై బహిష్కరణ వేటు పడిందని అధికారులు తెలిపారు.

ఇక ఇలా దేశ నుంచి వెళ్లగొట్టిన వారిలో చాలా మంది చట్ట విరుద్ధంగా (Illegal Expats) దేశం ఉంటున్న మత్స్యకారులు, మెన్స్ మసాజ్ పార్లలో పనిచేస్తున్నవారు, ఇతర ఫార్మ్స్‌తో పాటు ముత్లా, సులైబియా, కబద్ తదితర ప్రాంతాలలోని స్క్రాప్ యార్డ్స్‌లో పని చేస్తున్న కార్మికులు ఉన్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు. మునుముందు కూడా ఈ సోదాలు ఇలాగే కొనసాగుతాయని, చట్ట విరుద్ధంగా దేశంలో ఉంటున్న వలసదారులను గుర్తించి ఎట్టిపరిస్థితుల్లో దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుందని సంబంధిత అధికారులు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-24T12:05:58+05:30 IST