Home » Kuwait
కువైత్‌లోని ఏజెంట్ చెరలో చిక్కుకున్న మన జిల్లా మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించనుంది.
కువైట్ అత్యున్నత పురస్కారాన్ని అందజేయానికి ముందు కువైట్ బయన్ ప్యాలెస్ వద్ద మోదీకి "గార్డ్ ఆఫ్ హానర్''తో సాదర స్వాగతం పలికారు. కువైట్ దేశ రాజు షేక్ మిషాల్ అల్‌అహ్మద్ అల్ జుబేర్ అల్ సబహ్ కరచనాలతో ఆత్మీయ స్వాగతం తెలిపారు.
ఏ దేశానికి వెళ్ళినా, ఆ దేశ ప్రజలు-భారతీయుల మధ్య సత్సంబంధాలను పటిష్ట పరచడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్య నీతి సాగుతోంది. బహుళ ధ్రువ ప్రపంచంలో ఎటువైపూ వాలిపోకుండా, సమాన దూరం పాటిస్తూ, సమతుల్యతతో అన్ని దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు.
రెండ్రోజుల కువైట్ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో శనివారం సాయంత్రం నిర్వహించిన 'హలా మోదీ' కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ దేశ నేతలతో ఎప్పుడు మాట్లాడినా భారతీయుల గురించి ప్రశంసిస్తుంటారని అన్నారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్‌లోని గల్ఫ్ స్పిక్ లేబర్ క్యాంప్‌ను శనివారంనాడు సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న భారతీయ కార్మికులను కలుసుకున్నారు.
మోదీ తన పర్యటనలో కువైట్ అగ్ర నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ముఖ్యంగా రక్షణ, భద్రత, వాణిజ్యంపై ప్రధానమంత్రి దృష్టి సారించనున్నట్టు చెబుతున్నారు.
రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ బయలుదేరి వెళ్లారు. శనివారం ఉదయం న్యూఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో పీఎం మోదీ కువైట్కు బయలుదేరారు.
ముంబై నుంచి మాంచెస్టర్ వెళ్తున్న విమానంలోని భారతీయ ప్రయాణికులు కువైట్ ఎయిర్పోర్టులో దాదాపు 14 గంటలకు పైగా చిక్కుకుపోయారు. ఆ క్రమంలో తమకు తిండి, పానీయం లేకుండా పోయిందని, ఇంకా ఎలాంటి సాయం అందలేదని ప్రయాణికులు చెబుతున్నారు.
కువైట్ విమానాశ్రయంలో భారతీయులు సుమారు 23 గంటలపాటు పడిగాపులు పడాల్సి వచ్చింది.
ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లి మోసపోతున్న ఘటనలు ఇటీవల ఎక్కువుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి కువైట్, దుబాయి వెళ్లి మోసపోతున్నారు. ఇలాంటి సంఘటనల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి..