Drunk woman: దుబాయ్‌లో షాకింగ్ సంఘటన.. తాగిన మైకంలో ట్యాక్సీ డ్రైవర్‌పై మహిళ..

ABN , First Publish Date - 2022-11-05T11:17:20+05:30 IST

ఆసియాకు చెందిన 31 ఏళ్ల ఓ మహిళకు తాజాగా దుబాయ్ క్రిమినల్ కోర్టు 3వేల దిర్హమ్స్ (రూ.67వేలు) జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటో తెలుసా?

Drunk woman: దుబాయ్‌లో షాకింగ్ సంఘటన.. తాగిన మైకంలో ట్యాక్సీ డ్రైవర్‌పై మహిళ..

దుబాయ్: ఆసియాకు చెందిన 31 ఏళ్ల ఓ మహిళకు తాజాగా దుబాయ్ క్రిమినల్ కోర్టు 3వేల దిర్హమ్స్ (రూ.67వేలు) జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటో తెలుసా? తాగిన మైకంలో ఉన్న ఆమె.. ట్యాక్సీ డ్రైవర్‌పై (Taxi driver) దాడిచేసి, తీవ్రంగా గాయపరచడం. ప్రయాణికురాలి దాడితో డ్రైవర్ కంటికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో బాధితుడు 20రోజుల పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. తనపని తాను చేసుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో బాధిత ట్యాక్సీ డ్రైవర్ దుబాయ్ పోలీసులకు (Dubai Police) ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి తాజాగా మహిళను న్యాయస్థానంలో హాజరుపరిచారు.

అసలేం జరిగిందంటే.. ఈ సంఘటన ఈ ఏడాది సెప్టెంబర్‌లో చోటు చేసుకుంది. జేబీఆర్ ప్రాంతం నుంచి దుబాయ్ (Dubai) వెళ్లేందుకు ఓ మహిళ ట్యాక్సీ బుక్ చేసుకుంది. దాంతో ట్యాక్సీ డ్రైవర్ ఆమెను జేబీఆర్ ప్రాంతం నుంచి పికప్ చేసుకుని దుబాయ్‌లో డ్రాప్ చేశాడు. కానీ, సదరు మహిళ తన గమ్యస్థానానికి చేరుకోగానే ట్యాక్సీకి అయిన చార్జీలు చెల్లించకుండా అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించింది. దాంతో డ్రైవర్ చార్జీలు చెల్లించాలని అడిగాడు. అంతే.. తాగిన మైకంలో ఉన్న ఆమె (Drunk woman).. డ్రైవర్‌ మాట్లాడుతుండగానే అతడిపై దాడికి దిగింది. ముఖంపై పిడిగుద్దులతో విరుచుకుపడింది. తన పదునైన చేతివేళ్ల గోళ్లతో డ్రైవర్ ముఖం, చేతులపై తీవ్రంగా గాయపరిచింది.

ట్యాక్సీ చార్జీల విషయంలో ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించిన తనను ఇలా అన్యాయంగా దాడిచేసి తీవ్ర గాయాలపాలు చేసిందని బాధితుడు వాపోయాడు. తన కంటికి అయిన గాయాల కారణంగా 20 రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోయినట్లు తెలిపాడు. మద్యం మత్తులో ఉండడంతోనే ఆమె ఇలా చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు సదరు మహిళపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను గుర్తించి విచారించారు. విచారణలో తాను తాగిన మైకంలో ఉండడంతో ఏం చేశానో తెలియలేదని ఆమె ఒప్పుకున్నట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. తాజాగా ఆమెను దుబాయ్ కోర్టులో హాజరుపరిచారు. దాంతో తన నేరాన్ని అంగీకరించిన మహిళకు న్యాయస్థానం రూ.67వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేగాక ఇంకోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

Updated Date - 2022-11-05T11:17:22+05:30 IST