Dubai Shopping Festival: ఎన్నో అద్భుత ఆఫర్లు.. మరెన్నో నమ్మశక్యంకాని డీల్స్.. 46రోజులు విజిటర్లకు పండగే!

ABN , First Publish Date - 2022-12-16T09:21:50+05:30 IST

ఎన్నో అద్భుత ఆఫర్లు, మరెన్నో నమ్మశక్యంకాని డీల్స్‌తో విజిటర్లు, నివాసితులు, ప్రవాసులను మెస్మరైజ్ చేసేందుకు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (Dubai Shopping Festival) రెడీ అయింది.

Dubai Shopping Festival: ఎన్నో అద్భుత ఆఫర్లు.. మరెన్నో నమ్మశక్యంకాని డీల్స్.. 46రోజులు విజిటర్లకు పండగే!

దుబాయ్: ఎన్నో అద్భుత ఆఫర్లు, మరెన్నో నమ్మశక్యంకాని డీల్స్‌తో విజిటర్లు, నివాసితులు, ప్రవాసులను మెస్మరైజ్ చేసేందుకు దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (Dubai Shopping Festival) రెడీ అయింది. గురువారం (డిసెంబర్ 15) ప్రారంభమైన ఈ ఫెస్టివల్ 2023 జనవరి 29వ తేదీ వరకు జరుగుతుంది. 46రోజుల పాటు మునుపెన్నడూ లేని బంపరాఫర్లు షాపింగ్ లవర్లను ఆకట్టుకోవడం ఖాయమని నిర్వాహకులు చెబుతున్నమాట. 46 రోజుల ఈ అద్భుతమైన వినోదం, పెద్ద కచేరీలు, మిస్సవలేని ఫ్యాషన్ ఎక్స్‌క్లూజివ్‌లు, అద్భుతమైన షాపింగ్ డీల్‌లు, రాఫెల్‌లు, అత్యద్భుతమైనహోటల్ మరియు డైనింగ్ ఇలా మరెన్నో హంగులతో ఈ సంవత్సరం డీఎస్‌ఎఫ్ (DSF) తిరిగి వచ్చింది.

దుబాయ్ ఫెస్టివల్స్ మరియు రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (Dubai Festivals and Retail Establishment) ద్వారా నిర్వహించబడుతున్న డీఎస్‌ఎఫ్ ఈ ఎడిషన్ నివాసితులు, సందర్శకులందరికీ ఉత్తమమైన, అద్భుతమైన్ షాపింగ్ అనుభూతిని కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సందర్శకులకు థియేట్రికల్ ప్రదర్శనలు, కమ్యూనిటీ మార్కెట్‌లు, జానపద మరియు వారసత్వ ప్రదర్శనలు, సరదా ఉత్సవాలు, కుటుంబాలు, పిల్లల కోసం అనేక ఇతర ప్రదర్శనలు ప్రత్యేక అనుభూతిని కలిగించడం ఖాయం.

ఈ ఫెస్టివల్‌లో ప్రపంచంలోని అత్యుత్తమ నూతన సంవత్సర వేడుకలు, ప్రత్యేకమైన భోజన అనుభవాలు, రాఫెల్‌లు, స్వదేశీ, గ్లోబల్ బ్రాండ్‌ల నుండి అత్యుత్తమ డీల్స్‌తో పాటు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సంగీత ప్రత్యక్ష కచేరీలు కనిపిస్తాయి. ఈ సంవత్సరం బుర్జ్ పార్క్‌లోని ప్రసిద్ధ మార్కెట్ ఓటీబీ (OTB), అల్ సీఫ్‌లోని డీఎస్ఎఫ్ (DSF) మార్కెట్, చాలా కాలంగా నడుస్తున్న డీఎస్ఎఫ్ డ్రోన్స్ లైట్ షో అనేది ఆకర్షణీయమైన దుబాయ్ లైట్స్ ఎగ్జిబిషన్‌ను కూడా గుర్తు చేస్తుందని నిర్వాహకులు అంటున్నారు.

అలాగే డ్రోన్ షోతో పాటు డీఎస్ఎఫ్ బాణాసంచా ప్రదర్శనలు కూడా ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణ. జనాదరణ పొందిన ట్యూన్స్ Dxb కూడా ఈ యేటా తిరిగి వస్తుంది. హాటెస్ట్, హిప్పెస్ట్ ఎమర్జింగ్ టాలెంట్‌లతో లైవ్ పెర్‌ఫార్మెన్స్‌లతో సంగీత ప్రియులకు పది రోజుల వేడుకను అందించనుంది. ఇలా ఈ ఏడాది ఎన్నో ప్రత్యేకతలతో ప్రారంభమైన దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ అనేది విజిటర్లు, నివాసితులను మరో కొత్త లోకాన్ని తీసుకెళ్తుందనడంలో ఎలాంటి అనుమానమే లేదని నిర్వాహకులు చెబుతున్నారు.

Updated Date - 2022-12-16T09:56:59+05:30 IST