Indian Citizenship: ఆ మూడు దేశాల ముస్లిమేతరులకు పౌరసత్వం

ABN , First Publish Date - 2022-11-02T07:12:54+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ దేశాల నుంచి వలస వచ్చి గుజరాత్‌లో నివసిస్తున్న హిందువులతోపాటు సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Indian Citizenship: ఆ మూడు దేశాల ముస్లిమేతరులకు పౌరసత్వం

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం

న్యూఢిల్లీ, నవంబరు 1: అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ దేశాల నుంచి వలస వచ్చి గుజరాత్‌లో నివసిస్తున్న హిందువులతోపాటు సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వాన్ని మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ) కింద కాకుండా, పౌరసత్వ చట్టం-1955 కింద వీరికి పౌరసత్వాన్ని ఇవ్వనున్నట్టు తెలిపింది. ఆనంద్‌, మెహసన జిల్లాల్లో నివసిస్తున్న ఆయా మతస్థులను భారత పౌరులుగా నమోదు చేసేందుకు అనుమతిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పై మూడు దేశాల నుంచి వలస వచ్చే ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ 2019 డిసెంబరులో పార్లమెంటు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ముస్లింలను మినహాయించడంపై దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనల్లో సుమారు వందమంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2022-11-02T07:12:56+05:30 IST