Kuwaitis and Expats: వామ్మో.. కువైత్‌లో పెట్రోల్ కోసం సగటున రోజుకు రూ.30కోట్లు ఖర్చు చేస్తున్నారట..!

ABN , First Publish Date - 2022-12-11T08:52:31+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌లో (Kuwait) వాహనాల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడంతో పెట్రోలియం (Petroleum) వినియోగం కూడా భారీగా పెరిగినట్లు కువైత్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (Kuwait National Petroleum Company) నివేదిక వెల్లడించింది.

Kuwaitis and Expats: వామ్మో.. కువైత్‌లో పెట్రోల్ కోసం సగటున రోజుకు రూ.30కోట్లు ఖర్చు చేస్తున్నారట..!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో (Kuwait) వాహనాల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడంతో పెట్రోలియం (Petroleum) వినియోగం కూడా భారీగా పెరిగినట్లు కువైత్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (Kuwait National Petroleum Company) నివేదిక వెల్లడించింది. కంపెనీ డేటా ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు 4.46 బిలియన్ లీటర్ల పెట్రోల్ (Petrol) వినియోగం జరిగింది. అంటే రోజుకు సగటున 12.2 మిలియన్ లీటర్లు. ఇది గతేడాదితో పోలిస్తే 26శాతం మేర పెరిగింది. 2021లో మొత్తం వినియోగం 3.5 బిలియన్ లీటర్లుగా నమోదైంది. కాగా, కరోనా తర్వాత మునుపటి మాదిరి దేశ ప్రజల సాధారణ జీవనం మొదలు కావడంతోనే ఈ పెరుగుదల నమోదైనట్లు కంపెనీ తెలిపింది.

ఇక దేశ పౌరులు, ప్రవాసులు కలిసి పెట్రోలియం కోసం రోజుకు సగటున 1.14 మిలియన్ కువైటీ దినార్లు (రూ. 30.67కోట్లు) వెచ్చిస్తున్నట్లు కంపెనీ డేటా ద్వారా తెలిసింది. దేశ జనాభా కూడా పెరుగుతుండడం, దానికి అనుగుణంగా వాహనాల వాడకం పెరగడంతో ఇంధనం, గ్యాసోలిన్ వినియోగం అమాంతం పెరిగింది. అటు దేశవ్యాప్తంగా కిరోసిన్ (Kerosene) వినియోగం కూడా భారీగా పెరిగినట్లు కంపెనీ డేటా చెబుతోంది. గతేడాది 108.8 మిలియన్ లీటర్లు వినియోగం జరిగితే, ఈ ఏడాది ఇప్పటివరకు 176.6 మిలియన్ లీటర్లుగా నమోదైంది. అదే 2018/2019లో 169.1 మిలియన్ లీటర్లు, 20117/2018లో 158 మిలియన్ లీటర్లు, 2016/2017లో 141 మిలియన్ లీటర్ల వినియోగం జరిగినట్లు కంపెనీ గణాంకాలు చెబుతున్నాయి.

Updated Date - 2022-12-11T09:00:06+05:30 IST