Melinda Gates: బిల్ గేట్స్ మాజీ భార్య.. సీనియర్ రిపోర్టర్‌తో డేటింగ్..!
ABN , First Publish Date - 2022-11-11T10:30:54+05:30 IST
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్ (Bill Gates) గతేడాది ఆయన భార్య మిలిందా గేట్స్‌కు (Melinda Gates) విడాకులిచ్చి (Divorce) అందరికి షాకిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్ (Bill Gates) గతేడాది ఆయన భార్య మిలిందా గేట్స్‌కు (Melinda Gates) విడాకులిచ్చి (Divorce) అందరికి షాకిచ్చారు. ఏమైందో ఏమో కానీ 27 ఏళ్ల వివాహ బంధానికి ఉన్నట్టుండి ఈ దంపతులు స్వస్తి పలికారు. 1994లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక బిల్ గేట్స్‌తో విడిపోయిన తర్వాత తాను భరించలేని మనోవేదనకు గురైనట్టు కూడా మిలిందా ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ బాధ నుంచి ఆమె ఉపశమనం పొందుతున్నట్టు తెలుస్తోంది. మిలిందా గేట్స్ మళ్లీ ప్రేమలో పడినట్టు సమాచారం. ఓ సీనియర్ రిపోర్టర్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నట్టు అమెరికా మీడియా (America Media) కోడై కూస్తోంది.
58 ఏళ్ల ఆమె.. మాజీ టీవీ రిపోర్టర్ 60 ఏళ్ల జాన్ డ్యూ ప్రీ(Jon Du Pre)తో డేటింగ్ చేస్తున్నట్టు ఓ ఆన్‌లైన్ మీడియా ఏజెన్సీ కథనం ప్రచురించింది. గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయని తన కథనంలో రాసుకొచ్చింది. కానీ వీరిద్దరూ ఎలా కలిశారన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఇదిలాఉంటే.. జాన్, మిలిందా ఇద్దరూ కలిసి ఇప్పటికే చాలాసార్లు మీడియాకు చిక్కారు. 2022 ఏప్రిల్‌లో నెట్స్‌కి, సెలాటిక్స్‌కి మధ్య జరిగిన బాస్కెట్‌బాల్ గేమ్‌కి ఈ జంట కలిసి వెళ్లినప్పుడు తొలిసారి మీడియా కంటబడింది. ప్రస్తుతం వీరు డేటింగ్‌లో ఉన్నారని అక్కడి మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. అలాగే మిలిందా ప్రైవేట్ ఇన్‌స్టా ఖాతాను జాన్ ఫాలో అవుతుండడం కూడా ఈ రూమర్లకు మరింత తావిచ్చింది. అయితే, ఈ రూమర్స్‌పై మిలిందా గేట్స్ కానీ, జాన్ కానీ ఇంకా స్పందించలేదు.