Saudi Arabia: కువైత్ బాటలోనే సౌదీ.. ఆందోళనలో ప్రవాసులు

ABN , First Publish Date - 2022-12-20T11:28:24+05:30 IST

కువైత్ (Kuwait) బాటలోనే సౌదీ అరేబియా (Saudi Arabia) పయనిస్తోంది.

Saudi Arabia: కువైత్ బాటలోనే సౌదీ.. ఆందోళనలో ప్రవాసులు

రియాద్: కువైత్ (Kuwait) బాటలోనే సౌదీ అరేబియా (Saudi Arabia) పయనిస్తోంది. స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా తాజాగా సౌదీ ముందడుగు వేసింది. ఉద్యోగాల్లో స్థానికీకరణను సౌదీ ప్రారంభించిన అరబ్ దేశం మొదటి దశలో కింగ్‌డమ్‌లోని అన్ని ప్రాంతాలలో ఉన్న పోస్టల్, పార్శిల్ సర్వీసులకు (Postal and Parcel Services) దీన్ని అమలు చేస్తున్నట్లు మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖ (Ministry of Human Resources and Social Development) వెల్లడించింది. ఈ మేరకు తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేసింది. కంపెనీలు, వ్యాపారాలకు ఇచ్చిన లోకలైజేషన్ గ్రేస్ పీరియడ్ గడువు ముగిసిందని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ పేర్కొంది. పోస్టల్, పార్శిల్‌లో 14 సర్వీసులను వంద శాతం సౌదీసీకరణ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. హడాఫ్‌గా పేర్కొనే సౌదీ మానవవనరుల అభివృద్ధి నిధుల ద్వారా రిక్రూట్‌మెంట్, సౌదీ జాతీయీకరణ పథకం (Saudi Nationalization Scheme) సపోర్ట్ ప్రోగ్రామ్‌లకు యాక్సెస్ పొందేందుకు ఈ ప్యాకేజీ మద్దతు ఇస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది.

ఇది ఉపాధి, సాధికారత శిక్షణ కోసం వివిద రంగాలలోని సంస్థలకు మద్దతును అందిస్తుందని మంత్రిత్వశాఖ అధికారులు తెలియజేశారు. హడాఫ్ కింద ఈ సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ప్రైవేట్ రంగ కంపెనీల్లో 2.77లక్షల మంది స్త్రీ, పురుష అభ్యర్థుల ఉపాధికి మద్దతు ఇచ్చినట్లు మంత్రిత్వశాఖ చెప్పుకొచ్చింది. ఇక విజన్ 2030 (Vision 2030)లో భాగంగా కింగ్‌డమ్‌లో మరిన్ని ఉద్యోగావశాలు పెంచాలని సౌదీ భావిస్తోంది. వర్క్‌ఫోర్స్‌ను భారీగా పెంచడం ద్వారా ఆటోమెటిక్‌గా అన్ని రంగాల్లో ఉత్పత్తి పెరుగుతోంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందనేది అరబ్ దేశం ఆలోచన. కాగా, సౌదీ అరేబియా సెంట్రల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, రాజ్యంలో నిరుద్యోగం రేటు 2022 మొదటి త్రైమాసికంలో 6 శాతంగా ఉండగా.. రెండవ త్రైమాసికంలో 5.80 శాతానికి తగ్గింది. ఇక తన విజన్ 2030 లక్ష్యాలను సాధించడానికి సౌదీ.. ప్రైవేట్ రంగ ఉద్యోగాలకు జాతీయులను నియమించడాన్ని ప్రోత్సహిస్తోంది. ఇదిలాఉంటే.. కువైత్ బాటలోనే సౌదీ అరేబియా కూడా స్థానికీకరణను ప్రోత్సహిస్తుండడం ప్రవాసులను ఆందోళన కలిగిస్తోంది. అలాగే రాబోయే రోజుల్లో వలస కార్మికులు కింగ్‌డమ్‌లో గడ్డుకాలం ఎదుర్కొవడం తప్పకపోవచ్చని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2022-12-20T11:28:26+05:30 IST