UAE: లక్కీ ఛాన్స్.. రూ.2వేలకే టూరిస్ట్ వీసా
ABN , First Publish Date - 2022-11-02T08:33:53+05:30 IST
ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022కు (Fifa World Cup Qatar 2022) హాజరయ్యే అభిమానుల నుంచి మల్టీపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాల (Multiple entry tourist visa) కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మంగళవారం (నవంబర్ 1వ తేదీ) నుంచి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది.
అబుదాబి: ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022కు (Fifa World Cup Qatar 2022) హాజరయ్యే అభిమానుల నుంచి మల్టీపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాల (Multiple entry tourist visa) కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మంగళవారం (నవంబర్ 1వ తేదీ) నుంచి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరిగే ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు 'హయ్యా' కార్డులకు (Hayya card ) దరఖాస్తు చేసుకోవాలని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజెన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) సాకర్ అభిమానులను కోరింది. అలాగే హయ్యా కార్డును కలిగి ఉన్న అంతర్జాతీయ అభిమానులు ఐసీపీ అధికారిక వెబ్‌సైట్‌లో యూఏఈ మల్టీపుల్ ఎంట్రీ పర్యాటక వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వరల్డ్ కప్ ఫ్యాన్స్ మల్టీ ఎంట్రీ వీసాతో 90 రోజుల వ్యవధిలో ఎమిరేట్స్‌లోకి మల్టీ ఎంట్రీలకు అవకాశం ఉంటుందని వివరించింది. వీసా రుసుమును వన్-టైమ్ చార్జీ కింద 100 దిర్హమ్స్‌గా(రూ.2252) నిర్ణయించినట్లు పేర్కొంది. ఆపై సాధారణ రుసుముతో దీనిని మరో 90 రోజులకు పొడిగించుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపింది.