అవినీతిని నిరూపించే దమ్ము పవన్‌కు ఉందా?: డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి
ABN , First Publish Date - 2022-11-13T20:18:31+05:30 IST
విజయనగరం జిల్లాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పర్యటనపై ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి (Kolagatla Veerabhadra Swamy) ఫైర్ అయ్యారు.
గుంటూరు: విజయనగరం జిల్లాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పర్యటనపై ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి (Kolagatla Veerabhadra Swamy) ఫైర్ అయ్యారు. జగనన్న కాలనీల్లో అవినీతి జరిగిందని కేకలు వేయడమే తప్ప, ఎందుకోసం వచ్చాడో పవన్‌కే తెలియదని విమర్శించారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే పవన్ పర్యటన చేస్తున్నారని మండిపడ్డారు. పవన్‌కు అవినీతిని నిరూపించే దమ్ముందా అని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టడానికి, చంద్రబాబును సంతోషపెట్టడానికే పవన్ పర్యటిస్తున్నారని కోలగట్ల అన్నారు. పవన్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదని, రెండు సార్లు ఓటమి చూసిన పవన్‌కు 2024లోనూ ఓటమి తప్పదని కోలగట్ల జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి అయిపోతాననంటూ చంకలు గుద్దుకునే పవన్... వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులున్నారా అని ప్రశ్నించారు. నీ అభిమానుల కేకలు తప్ప.. ఒక్క లబ్ధిదారుడుతోనైనా మాట్లాడించగలిగావా అని కోలగట్ల ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు పవన్ గోల చేస్తారని, ఎన్నికల్లో గెలుపు మాత్రం జగన్‌దే డిప్యూటీ స్పీకర్ అన్నారు. ఋషికొండ వెళ్లి ఏం అవినీతి నిరూపించావని, గతంలో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతే, అడిగే ధైర్యం పవన్‌కు లేదా అని కోలగట్ల ప్రశ్నించారు.