Moinabad farmhouse case: పెనుసంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. .
ABN , First Publish Date - 2022-11-11T17:57:04+05:30 IST
మునుగోడు ఉపఎన్నికలకు ముందు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. అటు ప్రజల్లోనూ, రాజకీయ పార్టీల్లో ఈ వ్యవహారం దుమారం రేగింది.
హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలకు ముందు ఎమ్మెల్యేల కొనుగోలు (MLAs poaching case) వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. అటు ప్రజల్లోనూ, రాజకీయ పార్టీల్లో ఈ వ్యవహారం దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసు (Moinabad farmhouse case) విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయానికి సీపీ సీవీ ఆనంద్ వచ్చారు. నిందితుల విచారణను సీపీ సీవీ ఆనంద్ పర్యవేక్షిస్తున్నారు. ముగ్గురు నిందితుల వాయిస్ శాంపిళ్లను అధికారులు తీసుకున్నారు. నేటితో ముగ్గురు నిందితుల కస్టడీ ముగియనుంది.RRR