Viral Video: ఈ కోతి రూటే సపరేటు గురూ.. బీరు బాటిల్‌లో చుక్క కూడా మిగల్చకుండా..

ABN , First Publish Date - 2022-11-01T20:04:14+05:30 IST

కోతి చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. మనుషులపై దాడులు చేయడం, తినుబండారాలను లాక్కోవడం, స్మార్ట్ ఫోన్‌లను ఎత్తుకెళ్లడానికి సంబంధించిన వీడియోలు.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో (monkeys Videos).. కోతి చేసిన విచిత్రమైన పని..

Viral Video: ఈ కోతి రూటే సపరేటు గురూ.. బీరు బాటిల్‌లో చుక్క కూడా మిగల్చకుండా..

కోతి చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. మనుషులపై దాడులు చేయడం, తినుబండారాలను లాక్కోవడం, స్మార్ట్ ఫోన్‌లను ఎత్తుకెళ్లడానికి సంబంధించిన వీడియోలు.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో (monkeys Videos).. కోతి చేసిన విచిత్రమైన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. వైన్ షాపులో టిన్ బీరును ఎత్తుకెళ్లిన కోతి.. అందులో చుక్క కూడా మిగల్చకుండా గుట గుటా తాగేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

యువతి ఇయర్ బడ్స్‌పై కన్నేసిన చిలుక.. చివరకు ఎంత తెలివిగా దొంగతనం చేసిందో చూడండి..

ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ (Twitter viral videos) అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) రాయ్‌బరేలీలోని మద్యం దుకాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షాపులోకి చొరబడిన ఓ కోతి టిన్ బీరును ఎత్తుకెళ్తుంది. ఏకాంతంగా కూర్చుని గుటా గుటా లాగించేస్తుంది. మధ్య మధ్యలో బాటిల్‌ను ఊపుతూ, తాగుతూ ఉంటుంది. చివరకు చుక్క కూడా మిగల్చకుండా చెక్ చేసి మరీ మొత్తం తాగేస్తుంది. చివరలో... అప్పుడే అయిపోయిందే.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ప్రాంతంలోని కోతులు తరచూ దాడులు చేస్తూ.. మందుబాబుల వద్ద నుంచి బాటిళ్లు లాక్కుంటూ ఉంటాయని స్థానికులు తెలిపారు. మొత్తానికి ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Black water: ఈ నీరు తాగితే నిజంగా అంత బలమొస్తుందా.. సెలబ్రిటీలు తాగే ఈ బ్లాక్ వాటర్ ప్రత్యేకతలు ఏంటంటే..

Updated Date - 2022-11-01T20:04:18+05:30 IST