Viral Video: ఆస్పత్రిలో మహిళ పట్ల సిబ్బంది నిర్వాకం.. అంతా చూస్తుండగా..
ABN , First Publish Date - 2022-10-28T20:58:13+05:30 IST
ఆస్పత్రుల్లో రోగుల ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో డబ్బుల విషయంలో.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులకు సమస్యలు ఎదురువుతుంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయే ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. అయితే అప్పుడప్పుడూ రోగుల కారణంగా కూడా..
ఆస్పత్రుల్లో రోగుల ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో డబ్బుల విషయంలో.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులకు సమస్యలు ఎదురువుతుంటాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయే ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. అయితే అప్పుడప్పుడూ రోగుల కారణంగా కూడా ఆస్పత్రి సిబ్బందికి సమస్యగా మారుతుంటుంది. ప్రస్తుతం ఇలాంటి ఓ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఎవరిది తప్పో తెలీదు గానీ ఓ మహిళా రోగి పట్ల ఆస్పత్రి సిబ్బంది ప్రవర్తించిన తీరు.. ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
Viral Video: యువతి సాయం చేయగానే.. చివర్లో ఏనుగు ఎక్స్‌ప్రెషన్ చూడండి..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) సీతాపూర్ జిల్లా ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి మహిళా వార్డులో (hospital Womens ward) అక్టోబర్ 18న ఓ మహిళ అడ్మిట్ అయింది. చికిత్స అనంతరం మరుసటి రోజు డిశ్చార్జి అయ్యారు. అయితే ఆ సమయంలో సదరు మహిళ.. వాష్ రూమ్‌కు వెళ్లింది. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. అక్కడ ఆమె పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మొదలెట్టింది. చేతి గాజులను పగులగొట్టడం, చీరను చించేయడం వంటి పనులు చేయడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. చివరకు ఆస్పత్రి సిబ్బంది కలుగజేసుకుని ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఓ నర్సు ఆమె చెవి పట్టుకుని కోపంగా నెట్టుకుంటూ వెళ్లింది. చివరకు బలవంతంగా ఓ మంచంపై పడుకోబెడతారు. అయితే దీనిపై రోగి బంధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రోగుల ప్రవర్తన బాగోలేదంటూ మండిపడ్డారు. దీనిపై ఆస్పత్రి ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. మహిళ కారణంగా రోగులు భయాందోళనకు గురయ్యారని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను పక్కకు తీసుకెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. మొత్తానికి ఈ వీడియో (Viral videos) నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
భర్త వీడియో తీస్తుండగా.. భార్య షాకింగ్ నిర్ణయం.. చివరకు బంధువుల రాకతో..