Viral Video: వృద్ధురాలి పట్ల ఈ కుక్క పిల్ల తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..

ABN , First Publish Date - 2022-10-26T21:36:41+05:30 IST

ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ (Twitter viral videos) అవుతోంది. ఓ వృద్ధురాలు ‘(old woman) పెరట్లో పని చేసుకుంటూ ఉంటుంది. అక్కడే తన పెంపుడు కుక్క పిల్ల (puppy dog) కూడా ఉంటుంది. తమ యజమానికి తోడుగా ఎటూ కదలకుండా అక్కడే నిలబడి గమనిస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత వృద్ధురాలు కింద ఉన్న ప్లాస్టిక్ స్టూలు కూర్చోవాలని ప్రయత్నిస్తుంది. దీన్ని గమనించిన కుక్క పిల్ల..

Viral Video:  వృద్ధురాలి పట్ల ఈ కుక్క పిల్ల తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తే.. ముక్కున వేలేసుకుంటారు..

కుక్కలకు అమితమైన విశ్వాసం ఉంటుందనే విషయం తెలిసిందే. యజమాని సంరక్షణ విషయంలో తమ ప్రాణాల్ని కూడా లెక్కచేయవు. ఒక్కరోజు కూడా యజమానులను విడిచిపెట్టి ఉండలేవు. అలాగే కొన్ని జాతులకు చెందిన కుక్కలు చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. అలాంటి కుక్కలు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇందుకు సంబధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Social media) తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ వృద్ధురాలి పట్ల కుక్క పిల్ల తీసుకున్న జాగ్రత్తలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Viral Video: ఇంట్లో కొండచిలువను పెంచుకుంటున్న మహిళ.. గాజు బాక్సు మూత తీయడంతో ఒక్కసారిగా ఏం చేసిందో చూడండి..

ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ (Twitter viral videos) అవుతోంది. ఓ వృద్ధురాలు ‘(old woman) పెరట్లో పని చేసుకుంటూ ఉంటుంది. అక్కడే తన పెంపుడు కుక్క పిల్ల (puppy dog) కూడా ఉంటుంది. తమ యజమానికి తోడుగా ఎటూ కదలకుండా అక్కడే నిలబడి గమనిస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత వృద్ధురాలు కింద ఉన్న ప్లాస్టిక్ స్టూలు కూర్చోవాలని ప్రయత్నిస్తుంది. దీన్ని గమనించిన కుక్క పిల్ల.. బామ్మ ఎక్కడ కిందపడుతుందో అని జాగ్రత్తలు తీసుకుంటుంది. స్టూలును పక్కకు జరుపుతూ.. బామ్మ కిందపడకుండా ఉండేలా చూసుకుంటుంది. స్టూలు మీద కూర్చున్న తర్వాత వృద్ధురాలి వద్ద ప్రేమగా ఒడిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఈ కుక్క పిల్ల తెలివి చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. బామ్మను కొడుకులు, మనువళ్లు సరిగా చూసుకుంటున్నారో లేదో తెలీదు గానీ.. ఈ కుక్క పిల్ల ఎంత బాగా చూసుకుంటోంది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

310 అడుగుల ఎత్తులో ముద్దులు పెట్టుకుంటూ ఫొటో తీసుకున్న జంట.. మరుక్షణమే ఎవరూ ఊహించని విధంగా..

Updated Date - 2022-10-26T21:39:32+05:30 IST