Viral Video: యువతిపై ప్రేమ కురిపించిన పులి.. వామ్మో!.. మరీ ఇంతాగానా..
ABN , First Publish Date - 2022-11-10T20:55:45+05:30 IST
క్రూర జంతువులను (wild animals) చూడాలంటేనే చచ్చేంత భయం పుడుతుంది. అలాంటిది ఇక వాటికి దగ్గరగా వెళ్లాలంటే.. ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే కొందరు పులులు, సింహాలను.. కుక్కపిల్లల్లా చూసుకుంటుంటారు. ఎంతలా అంటే..
క్రూర జంతువులను (wild animals) చూడాలంటేనే చచ్చేంత భయం పుడుతుంది. అలాంటిది ఇక వాటికి దగ్గరగా వెళ్లాలంటే.. ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే కొందరు పులులు, సింహాలను.. కుక్కపిల్లల్లా చూసుకుంటుంటారు. ఎంతలా అంటే చిన్న పిల్లలను ఎలా లాలిస్తారో.. అలానే పులులు, సింహాలనూ లాలిస్తుంటారు. ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఓ యువతి కూడా ఇలాగే చేసింది. పులి కూడా యువతి పట్ల ఎనలేని ప్రేమ కురిపించింది. ముద్దు పెట్టి మరీ యువతి పట్ల తనకున్న అభిమానాన్ని తెలియజేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో (Instagram viral videos) వైరల్ అవుతోంది. ఓ యువతి పులికి ఎంతో ప్రేమతో ముద్దు పెడుతుంది. అందుకు ప్రతిగా పులి కూడా ఆమెపై ముద్దుల వర్షం కురిపిస్తుంది. తన పిల్లలకు ఎలా ముద్దులు ఇస్తుందో.. అచ్చం అలాగే యువతికి కూడా ముద్దు పెడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వామ్మో! ఇదేం పులిరా నాయనా.. అంటూ కొందరు, అమ్మా తల్లీ.. అది పులి.. కొంచెం జాగ్రత్తగా ఉండు.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ఇప్పటి వరకూ మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి మరి..