రెండో పెళ్లి కావడం లేదని దిగులు.. ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో..
ABN , First Publish Date - 2022-12-15T15:42:16+05:30 IST
అతను మున్సిపల్ ఆఫీసులో పని చేస్తుంటాడు. దీంతో మంచి సంబంధం కూడా కుదిరింది. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ.. రెండేళ్లు కూడా కాకుండానే భార్య విడిపోయింది. దీంతో..
అతను మున్సిపల్ ఆఫీసులో పని చేస్తుంటాడు. దీంతో మంచి సంబంధం కూడా కుదిరింది. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ.. రెండేళ్లు కూడా కాకుండానే భార్య విడిపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయాడు. దీని నుంచి బయటపడేందుకు తాగుడు, డ్రగ్స్‌కు బానిసయ్యాడు. మధ్యలో ఎన్నో సంబంధాలు చూసినా వివాహం మాత్రం కాలేదు. ఈ సమస్యతో మరింతగా కుంగిపోయాడు. చివరకు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రాజస్థాన్ (Rajasthan) కోట పరిధి జవహర్ నగర్‌కు చెందిన లక్ష్మణ్(26)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. లక్ష్మణ్ మున్సిపల్ ఆఫీసులో స్వీపర్‌గా (Municipal office sweeper) పని చేసేవాడు. భార్యాభర్తలు (couple) ఇద్దరూ కొన్నాళ్ల పాటూ సంతోషంగానే ఉండేవారు. అయితే వివాహమైన రెండేళ్ల తర్వాత భార్య విడాకులు తీసుకుంది. దీంతో అప్పటి నుంచి ఒంటరిగా ఉన్నాడు. మళ్లీ వివాహం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అతడిని చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. దీంతో మధ్యలో తాగుడు, డ్రగ్స్‌కు (Drugs) అలవాటు పడ్డాడు. కరోనా సమయంలో ఇతడి తండ్రి కూడా మరణించాడు. దీంతో మరింతగా కుంగిపోయాడు. ఇదిలావుండగా, 15 రోజుల క్రితం లక్ష్మణ్ బైకు కూడా చోరీకి (Bike theft) గురైంది. దీంతో అతడు మానసికంగా మరింత ఇబ్బందిపడ్డాడు.
Police Jobs: ఎత్తు కోసం నెత్తిన ఎమ్ సీల్ పెట్టుకున్న యువతి.. చివరకు పోలీసులకు ఎలా దొరికిందంటే..
రోజులో ఎక్కువ సమయం ఏకాంతంగా గడపడానికి ఇష్టపడేవాడు. దీనికితోడు డ్రగ్స్ వాడకం కూడా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు రాత్రి తల్లి, సోదరుడు హన్సరాజ్‌తో కలిసి భోజనం చేశాడు. రాత్రి తన గదిలో పడుకున్నాడు. రోజూ పొద్దున డ్యూటీకి వెళ్లే లక్ష్మణ్.. ఆ రోజు మాత్రం బయటికి రాలేదు. దీంతో అతడికి టీ ఇచ్చేందుకు తల్లి తలుపు తట్టింది. అయితే ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులకు తెలిపింది. లక్ష్మణ్ సోదరుడు కిటీకి తలుపు తీసి చూడగా.. లోపల ఉరికి వేలాడుతూ కనిపించాడు. చివరకు తలుపులు బద్ధలుకొట్టి లోపలికి వెళ్లి లక్ష్మణ్‌ను కిందకు దించారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.