రైల్లో షాకింగ్ ఘటన.. అవాక్కైన ప్రయాణీకులు.. బోగీలోకి అర్ధరాత్రి ఓ ఆక్సిజన్ సిలిండర్ రావడం వెనుక..
ABN , First Publish Date - 2022-12-17T19:57:54+05:30 IST
ప్రయాణికులతో కిక్కిరిసిన రైలు బోగీలో ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ బోగీలోకి సడన్‌గా ఆక్సిజన్ సిలిండర్‌ను తీసుకురావడంతో ప్రయాణికులంతా షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక ..
ప్రయాణికులతో కిక్కిరిసిన రైలు బోగీలో ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ బోగీలోకి సడన్‌గా ఆక్సిజన్ సిలిండర్‌ను తీసుకురావడంతో ప్రయాణికులంతా షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. అదే సమయంలో పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. చివరకు అసలు విషయం తెలుసుకుని అంతా వారిని అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
వామ్మో.. ఇది కారు డిక్కీనా..? మెడికల్ స్టోరా..? ప్రభుత్వాసుపత్రి ముందే కొత్త వ్యాపారం..!
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భోపాల్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాయ్‌పూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ (Rajdhani Express) రైలు.. గురువారం అర్ధరాత్రి భోపాల్ రైల్వే స్టేషన్‌కి చేరుకుంది. రైలు ఆగగానే ఓ బోగీలోకి ఆక్సిజన్ సిలిండర్ (Oxygen cylinder) తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక కొద్ది సేపు అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. కాసేపటికి ఓ వ్యక్తి వద్దకు తీసుకొచ్చి ఆక్సిజన్ అందించారు. బ్రెయిన్ హెమరేజ్ సమస్యతో బాధపడుతున్న 40ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. అయితే నాగ్‌పూర్ చేరుకునేలోపు అతడికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది.
ప్లీజ్.. ఒక్క గంట ఆగండి.. పెళ్లయ్యాక నన్ను అరెస్ట్ చేసుకోండి.. పోలీసులను ఆ వరుడు వేడుకున్నా..
అతడి సమస్యను గమనించిన మెడికల్ సిబ్బంది.. రైల్వే పోలీసులకు (Railway Police) పోన్ చేసి, సమాచారం అందించారు. దీంతో భోపాల్ రైల్వే అధికారులు చొరవతో స్థానిక ఎన్‌జీవో బృందం సభ్యులు స్పందించి చర్యలు తీసుకున్నారు. రైలు అక్కడికి వచ్చేలోపు ఆక్సిజన్ సిలిండర్‌ను సిద్ధం చేశారు. వారు సమాయానికి బోగీ వద్దకు చేరుకోవడంతో రోగికి ప్రాణాపాయం తప్పింది. దీంతో రోగి కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గుండె సమస్య ఉన్న 26రోజుల వయసున్న శిశువును.. నాగ్ పూర్ నుంచి ఢిల్లీ తీసుకెళ్తున్నారు. భోపాల్ సమీపానికి చేరుకోగానే శిశువు పరిస్థితి విషమించింది. సమాచారం అందుకున్న భోపాల్ ఎన్‌జీవో సిబ్బంది.. ఆక్సిజన్ సిలిండర్‌ను స్టేషన్‌కు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు.
పెళ్లయిన మర్నాడే షాకింగ్ ఘటన.. పాడు పని చేస్తూ భార్యకు అడ్డంగా దొరికిపోయిన భర్త.. చివరకు..