Delhi Railway job: ఫ్లాట్‌ఫామ్ పై కూర్చుని వచ్చీపోయే రైళ్లను, బోగీలను లెక్కించడమే జాబ్.. నెలకు లక్షల్లో జీతమట..!

ABN , First Publish Date - 2022-12-20T15:49:17+05:30 IST

భద్రమైన ప్రభుత్వోద్యోగంలో చేరి జీవితంలో స్థిరపడాలనుకునే యువత ఆశలను కొందరు మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అమాయకుల నుంచి లక్షల్లో డబ్బులు గుంజుతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఉదంతమే వెలుగులోకి వచ్చింది.

Delhi Railway job: ఫ్లాట్‌ఫామ్ పై కూర్చుని వచ్చీపోయే రైళ్లను, బోగీలను లెక్కించడమే జాబ్.. నెలకు లక్షల్లో జీతమట..!

భద్రమైన ప్రభుత్వోద్యోగంలో చేరి జీవితంలో స్థిరపడాలనుకునే యువత ఆశలను కొందరు మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి అమాయకుల నుంచి లక్షల్లో డబ్బులు గుంజుతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఉదంతమే వెలుగులోకి వచ్చింది. తమిళనాడుకు చెందిన 28 మందిని రైల్వే ఉద్యోగాల పేరుతో ఢిల్లీకి (Delhi Railway job Scam) చెందిన ఓ గ్యాంగ్ మోసం చేసింది. వారి నుంచి ఏకంగా రూ.2.67 కోట్లు వసూలు చేశారు. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

తమిళనాడుకు చెందిన 78 ఏళ్ల సుబ్బుసామి అనే వ్యక్తి కొన్ని నెలల కిందట ఢిల్లీ వెళ్లాడు. అక్కడ అతనికి కొయంబత్తూరుకు చెందిన శివరామన్‌ అనే వ్యక్తి పరిచయయ్యాడు. తనకు ఎంపీలు, మంత్రులతో సంబంధాలున్నాయని, రైల్వేల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని శివరామన్‌ చెప్పాడు. అతడి మాటలు నిజమేనని నమ్మిన సుబ్బుసామి తనకు తెలిసిన ముగ్గురు యువకులను ఢిల్లీకి తీసుకెళ్లాడు. ఆ విషయం తెలుసుకున్న 25 మంది మదురై యువకులు కూడా ఉద్యోగాల కోసం సుబ్బుసామిని కలిశారు. అతడు వారిందర్నీ ఢిల్లీకి తీసుకెళ్లి శివరామన్‌కు పరిచయం చేశాడు. ఆ యువకులందరినీ శివరామన్.. వికాస్‌ రాణా అనే వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లాడు. వికాస్ ఉత్తర రైల్వేలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడని చెప్పాడు (28 People From Tamil Nadu Cheated).

రైల్వేలో టీటీఈ, ట్రాఫిక్‌ అసిస్టెంట్, క్లర్క్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల- రూ.24 లక్షల వరకు ఇద్దరూ కలిసి వసూలు చేశారు. మెడికల్ టెస్ట్‌లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసి, నకిలీ ఐడీ కార్డులు కూడా జారీ చేశారు. ముందు కొన్ని రోజులు ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శిక్షణ ఉంటుందని చెప్పారు. రోజుకు 8 గంటల పాటు స్టేషన్‌లో కూర్చుని వచ్చేపోయే రైళ్లు, వాటికి ఉండే బోగీలను లెక్కించాలని, ఆ ఉద్యోగాలకు ఇదే శిక్షణ అని నమ్మించారు. శిక్షణ పూర్తయిన తర్వాత నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు కూడా ఇచ్చారు. వాటిని పట్టుకుని రైల్వే ఆఫీస్‌కు వెళ్లిన యువకులకు అసలు విషయం తెలిసింది. తాము మోసపోయామని (Cheating) గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2022-12-20T15:49:18+05:30 IST