Uttar pradesh: పేషెంట్స్ చూస్తుండగానే డాక్టర్ భర్తను చెప్పుతో చితకబాదిన భార్య.. ఇంతకీ అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-12-19T18:31:31+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar pradesh) మొరాదాబాద్‌లో క్లినిక్‌లో కూర్చుని రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్ వద్దకు అతని భార్య వచ్చింది. వస్తూనే ఏం మాట్లాడకుండా చెప్పు తీసి భర్తను కొట్టడం (Doctor was beaten by his wife) ప్రారంభించింది. అసలు కథేంటంటే..

Uttar pradesh: పేషెంట్స్ చూస్తుండగానే డాక్టర్ భర్తను చెప్పుతో చితకబాదిన భార్య.. ఇంతకీ అసలు కథేంటంటే..

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar pradesh) మొరాదాబాద్‌లో క్లినిక్‌లో కూర్చుని రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్ వద్దకు అతని భార్య వచ్చింది. వస్తూనే ఏం మాట్లాడకుండా చెప్పు తీసి భర్తను కొట్టడం (Doctor was beaten by his wife) ప్రారంభించింది. అనంతరం బయటకు వెళ్లిపోయింది. షాకైన డాక్టర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు (Uttar pradesh News).

అమ్రోహాకు చెందిన యువకుడు మొరాదాబాద్‌లోని ఖ్వాజా నగర్‌లో క్లినిక్‌ని ప్రారంభించాడు. మూడేళ్ల క్రితం అతడికి వివాహమైంది. పెళ్లయిన 6 నెలలకే భార్య విషయం ఆ యువకుడికి తెలిసిపోయింది. ఆమెకు అస్లాం అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉందని కనిపెట్టాడు. అస్లాంతో తన భార్య అసభ్యకరంగా దిగిన ఫోటోలను చూశాడు. పెళ్లి తర్వాత కూడా అస్లాంతో అఫైర్ (Extra Marital Affair) కొనసాగిస్తోందని తెలుసుకున్నాడు. ఆమెతో గొడవకు దిగాడు. దాంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తకు దూరంగా ఆమె రెండున్నరేళ్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. హఠాత్తుగా రెండ్రోజుల క్రితం ఆమె తన ప్రియుడితో కలిసి భర్త క్లినిక్‌కు వచ్చింది.

వచ్చిన వెంటనే ఎలాంటి మాటలూ లేకుండా నేరుగా చెప్పు తీసి కొట్టడం మొదలుపెట్టంది. అనంతరం ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. షాకైన యువకుడు వెంటనే డయల్ 112కు సమాచారం అందించాడు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్యపై ఫిర్యాదు చేశాడు. గతంలో తన భార్య తన సోదరుడు, మేనల్లుడిపై తప్పుడు ఆరోపణలు చేసిందని, ఇప్పుడు సెటిల్‌మెంట్ కింద రూ.5 లక్షలు, 7 తులాల బంగారం డిమాండ్ చేస్తోందని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

Updated Date - 2022-12-19T18:31:34+05:30 IST