21 రోజుల క్రితం పుట్టిన పాపకు విపరీతంగా ఉబ్బిన పొట్ట.. స్కానింగ్ రిపోర్ట్‌‌ను చూసి నివ్వెరపోయిన డాక్టర్లు..!

ABN , First Publish Date - 2022-11-03T15:48:28+05:30 IST

అరుదైన జననం అని.. అప్పుడప్పుడూ వార్తల్లో వింటూ వుంటాం. కొందరు నవజాత శిశువులు అంగవైకల్యం, లేదా విచిత్ర ఆకృతితో జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పిల్లలను చూసినప్పుడు అయ్యో పాపం! అని అనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఓ అరుదైన కేసు జార్ఖండ్‌లో వెలుగులోకి వచ్చింది. 21 రోజుల వయసున్న శిశువుకు..

21 రోజుల క్రితం పుట్టిన పాపకు విపరీతంగా ఉబ్బిన పొట్ట.. స్కానింగ్ రిపోర్ట్‌‌ను చూసి నివ్వెరపోయిన డాక్టర్లు..!

అరుదైన జననం అని.. అప్పుడప్పుడూ వార్తల్లో వింటూ వుంటాం. కొందరు నవజాత శిశువులు అంగవైకల్యం, లేదా విచిత్ర ఆకృతితో జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పిల్లలను చూసినప్పుడు అయ్యో పాపం! అని అనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అలాంటి ఓ అరుదైన కేసు జార్ఖండ్‌లో వెలుగులోకి వచ్చింది. 21 రోజుల వయసున్న శిశువుకు పొట్ట విపరీతంగా ఉబ్బిపోయింది. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్ చేసిన వైద్యులు.. రిపోర్టును చూసి నివ్వెరపోయారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

నిర్మానుష్య ప్రదేశంలో.. కూతురు కేకలు విని పరుగెత్తుకుంటూ వెళ్లిన తల్లి.. అక్కడి దృశ్యం చూసి..

జార్ఖండ్ (Jharkhand) రాంచీ పరిధి రామ్‌గఢ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ అక్టోబర్ 10న ఆస్పత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. తర్వాత వారు డిశ్చార్జి అయ్యి.. ఇంటికి వెళ్లిపోయారు. అయితే రోజులు గడిచేకొద్దీ శిశువు కడుపు ఉబ్బిపోవడం ప్రారంభించింది. రోజు రోజుకూ పొట్ట ఉబ్బుతుండడంతో భయపడ్డ తల్లిదండ్రులు రెండు రోజుల కిందట ఆస్పత్రికి తీసుకొచ్చారు. శిశువుకు స్కాన్ చేయగా కడుపులో కొన్ని కణాలు ఉన్నట్లు గుర్తించారు. చివరకు ఆపరేషన్ (Operation) చేసి, కడుపులో నుంచి 8పిండాలను బయటికి తీశారు. ఆస్పత్రి వైద్యులు (Doctors) మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఇలాంటి కేసులు చాలా అరుదుగా సంభవిస్తుంటాయని చెప్పారు. అయితే కడుపులో నుంచి ఏకంగా ఎనిమిది పిండాలను తొలగించడం.. ప్రపంచంలోనే ఇదే మొదటి కేసు (Rare medical cases) అని చెప్పారు.

baby2.jpg

సెల్ఫీ తీసుకుందామని పిలవడంతో.. షాపింగ్ మాల్ వెనుక వైపునకు వెళ్లింది.. కాసేపటి తర్వాత చూస్తే..

తల్లి కడుపులో పెరుగుతున్న పిండంలోకి కొన్ని కణాలు ప్రవేశించడం వల్ల ఇలా జరుగుతుందని వివరించారు. అయితే ఇలా జరగడానికి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదన్నారు. కొన్ని నెలల క్రితం బీహార్‌లోనూ ఇలాగే జరిగింది. 40 రోజుల శిశువుకు కడుపు ఉబ్బిపోవడంతో వైద్యులను సంపద్రించారు. పరీక్షించిన వైద్యులు.. శిశువు కడుపులో పిండం పెరుగుతోందని గుర్తించారు. చివరకు ఆపరేషన్ చేసి పిండాన్ని తొలగించారు. ఈ రకమైన సమస్య ఐదు నుంచి పది లక్షల మంది పిల్లల్లో ఒకరిలో కనిపిస్తుంటుందని పేర్కొన్నారు.

Viral Video: వామ్మో!.. నడి సముద్రంలో రెప్పపాటు కాలంలో.. యువతికి పెద్ద ప్రమాదమే తప్పింది..

Updated Date - 2022-11-08T19:40:21+05:30 IST