ఉద్యోగంలోంచి తీసేసినా.. Parag Agarwal కు Elon Musk ఎన్ని వందల కోట్ల రూపాయలను ఇవ్వాల్సి ఉందంటే..!
ABN , First Publish Date - 2022-10-28T14:37:23+05:30 IST
తన చేతిలోకి ట్విట్టర్ రాగానే పరాగ్ అగర్వాల్ మీద చర్యలు తీసుకున్న ఎలన్ మస్క్.. భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తోంది.
చాలా రోజులపాటు డ్రామా నడిచిన తరువాత ఎట్టకేలకు ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను 44బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు. మొదట 9.2శాతం భాగస్వామ్యంతో ట్విట్టర్లో అడుగు పెట్టిన ఈయన చివరికి ట్విట్టర్‌నే ఊడ్చేసుకున్నాడు. మొదట చిన్న భాగస్వామ్యంతో అడుగు పెట్టిన మస్క్‌ను.. బోర్డ్ మెంబర్ సభ్యులలో ఒకరిగా చేరాలని ట్విట్టర్ రిక్వెస్ట్ చేసింది. కానీ ఎలన్ మస్క్ ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. ఆ తరువాత నేరుగా ట్విట్టర్ కొనడానికి ఈయన ఆసక్తి చూపించారు. తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో ట్విట్టర్ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ట్విట్టర్‌ను కొనుగోలు చేయాల్సిందే అని కోర్టు మస్క్‌ను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో తాజాగా ట్విట్టర్‌ను మస్క్.. 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. ట్విటర్ యాజమాన్య బాధ్యతలను స్వీకరించిన మస్క్.. పరాగ్ అగర్వాల్‌ను సీఈఓ పదవి నుండి తొలగించాడు. అలాగే ట్విట్టర్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ నెడ్ సెగల్‌తో పాటు మరికొందరిని కూడా తొలగించాడు. అయితే తన చేతిలోకి ట్విట్టర్ రాగానే పరాగ్ అగర్వాల్ మీద చర్యలు తీసుకున్న ఎలన్ మస్క్.. భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తోంది.
కంపెనీ నియమాల ప్రకారం ట్విట్టర్ ఒప్పందం జరిగిన 12నెలల లోపు సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను తొలగిస్తే ఆయనకు పరిహారంగా 42 మిలియన్ డాలర్లను మస్క్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది సుమారు రూ.345.72కోట్ల రూపాయలకు సమానం. పరాగ్ అగర్వాల్ పొందిన వేతనం, ఇతర చెల్లింపుల ఆధారంగా దీన్ని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎలన్ మస్క్ ఆవేశం కారణంగానే కోట్లాది రూపాయలను నీళ్లల చేజార్చుకునే పరిస్తితి వచ్చిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు