పోలీస్ స్టేషన్‌లోనే షాకింగ్ సీన్.. వేలం వేసిన ఓ కారులో ఓ ప్లాస్టిక్ బకెట్.. అందులో అస్తిపంజరాలు.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-11-10T18:56:26+05:30 IST

ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు సీజ్ చేసిన చాలా వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాజాగా, ఆ వాహనాలను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఓ కారును తనిఖీ చేశారు. అయితే అందులో ఉన్న ఓ ప్లాస్టిక్ బకెట్‪‌ను పరిశీలిస్తుండగా ..

పోలీస్ స్టేషన్‌లోనే షాకింగ్ సీన్.. వేలం వేసిన ఓ కారులో ఓ ప్లాస్టిక్ బకెట్.. అందులో అస్తిపంజరాలు.. అసలు కథేంటంటే..

ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు సీజ్ చేసిన చాలా వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాజాగా, ఆ వాహనాలను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఓ కారును తనిఖీ చేశారు. అయితే అందులో ఉన్న ఓ ప్లాస్టిక్ బకెట్‪‌ను పరిశీలిస్తుండగా అస్తి పంజరాలు బయటపడ్డాయి. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

‘అవును.. నా ప్రియుడిని చంపేందుకు 2 నెలల్లోనే 10 సార్లు ప్రయత్నించా..’..

తమిళనాడులోని (Tamil Nadu) విల్లుపురంలో పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్తపురం ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (Prohibition Enforcement Wing) అధికారులు సీజ్ చేసిన చాలా వాహనాలను విల్లుపురంలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇటీవల వాటిని వేలం వేయాలని నిర్ణయించారు. దీంతో అన్ని కార్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ కారులో పాత బకెట్ కనిపించింది. అందులో పరిశీలించగా మనిషి పుర్రె, ఎముకలు (Skeletons) బయటపడ్డాయి. వీటిని చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అయితే దీనిపై విల్లుపురం ఎస్పీ శ్రీనాథ్ మాట్లాడుతూ.. కారులో దొరికిన ఎముకలు మహిళ మృతదేహానికి సంబంధించినవని చెప్పారు. ల్యాబ్ పరీక్షల అనంతరం వాటిని భద్రపరిచేందుకు స్టేషన్‌లో వీలు లేకపోవడంతో కారులో ఉంచినట్లు చెప్పారు. ఎముకల శకలాలపై ఆరా తీస్తున్నామని, ఇలాంటి నమూనాలను పోలీస్ స్టేషన్లలో ఉంచవద్దని సిబ్బందిని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Viral Video: బైక్‌‌పై వెళ్తూ ప్రేయసి ఇన్‌స్టా రీల్స్.. సడన్‌గా వెనక్కు తిరిగిన ప్రియుడికి మైండ్‌బ్లాక్..!

ఇదిలావుండగా, 2021లో ఇండోర్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇండోర్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది తనిఖీ చేస్తుండగా.. ఓ మహిళ బ్యాగులో మనిషి పుర్రె, ఎముకలు బయటపడ్డాయి. ఆమె ఉజ్జయిని నుంచి ఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పింది. పుర్రె, ఎముకలను హరిద్వార్‌లో నిమజ్జనం చేసేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపింది. విచారణ అనంతరం అధికారులు ఆమెను విడుదల చేశారు. అదేవిధంగా బీహార్‌లోని అరారియా ప్రాంతంలోని ఇండో-నేపాల్ సరిహద్దులో ఓ వ్యాన్‌లో సుమారు 28మానవ అస్తి పంజరాలు బయటపడ్డాయి.

కూతురు ప్రేమ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు.. మూడేళ్లుగా ఇంట్లో చేసిన నిర్వాకం.. సడన్‌గా.

Updated Date - 2022-11-10T19:04:17+05:30 IST