hyderabad book exhibition : భిన్న మతాలు భిన్న కులాలతో సహజీవన సౌందర్యం..!
ABN , First Publish Date - 2022-12-23T21:29:19+05:30 IST
మంచి యే మతంలో వున్నాస్వీకరించుదాం.
హిందూ ముస్లిం రచయితలు రాసిన మతసామరస్యం రచనల పై సాహిత్య చర్చ జరిగింది. ప్రముఖ రచయిత నిఖిలేశ్వర్ మాట్లాడుతూ గంగా జమున తహజీబ్ అన్నారు. భిన్న మతాలు భిన్న కులాలతో సహజీవన సౌందర్యం ఉన్నటువంటిది మన ఈ భూమి అన్నారు. మంచితనం, మానవత్వం అనే సద్గుణాలు లేని మతం యేదైనా సంస్కరించబడాల్సిందే.
అంబేద్కర్ యూనివర్సిటీ విసి కే సీతారామారావు మాట్లాడుతూ మనుషులంతా ఒక్కటే అనే విషయాన్ని జ్ఞానం ఉన్న మనిషి ఎందుకు మర్చిపోతున్నాడో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ ముస్లింలు బాగానే ఉన్నారు కానీ సామాన్య మనుషులు మాత్రమే అనేక కష్టాలుపడుతున్నారు. ఈ సామాన్య మనుషుల్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. "మంచి చెడ్డలు రెండే మతములు" అనే సూక్తికి తిరుగు లేదు. మంచి యే మతంలో వున్నాస్వీకరించుదాం. చెడు యే మతంలో వున్నా తిరస్కరించుదాం అన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత మెర్సీ మార్గరెట్ మాట్లాడుతూ ఒకప్పుడు హైదరాబాదుకు ఉన్నటువంటి సామరస్యపు సువాసనలు ఇప్పుడు లేవని ఒక కులానికి మాత్రమే ఇళ్లను అద్దెకిస్తామని చెప్పడం ఒక మతానికి మాత్రమే ఇళ్లను అద్దెకిస్తామని చెప్పడం చాలా బాధిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ మతసామరస్యము ప్రజలంతా సమైక్యంగా ఉండేందుకు సాహిత్యాన్ని చదవాలని అందుకు ఈ బుక్ ఫెయిర్ లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.