Book Fair in Hyderabad: పుస్తకాల ఎంపికలో పిల్లల ఛాయిస్ ఇదే..!

ABN , First Publish Date - 2022-12-26T13:17:41+05:30 IST

తెలుగు కన్నా ఇంగ్లీష్ చదవడానికి ఇష్టపడతాను.

Book Fair in Hyderabad: పుస్తకాల ఎంపికలో పిల్లల ఛాయిస్ ఇదే..!
book fair in hyderabad

పుస్తకం చదవడంతోనే వర్తమానాన్ని గమనిస్తూ, భవిష్యత్ ను ఊహించవచ్చు. కాలంలో వస్తున్న మార్పులను, పాత, కొత్త పోకడల గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా పుస్తకాల ద్వారానే చేయగలం. మరి నేటి బాల్యం, యువత దారి ఎటుగా ఉంది. తెలుగునేల మీద పుట్టి తెలుగుకు ఎంతవరకూ న్యాయం చేస్తున్నాం. తెలుగు చదువుతున్నవారి సంఖ్య, పుస్తకాలు చదివే అలవాటును గమనించే విషయంలో విద్యార్థులు, కొందరు పుస్తక ప్రియుల అభిప్రాయాలను బుక్ ఫెయిర్ సందర్భంగా ఆంధ్రజ్యోతి వెబ్ వారితో జరిపిన ఆత్మీయ సంభాషణ..

Untitled-6.jpg

1. మానస..

నేను హైదరాబాద్ లోనే ఉంటాను. సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నాను. స్టూడెంట్స్ కి కావలసిన ఐఐటీ ఆల్ జీబ్రా బుక్స్, పాలిటిక్స్ కి సంబంధించి బుక్స్ తీసుకున్నాను. వాటితో పాటు డిటెక్టివ్ నవల్స్ అంటే నాకు ఇంట్రస్ట్ ఉంది అందుకే తంబోరా సీరీస్ తీసుకున్నాను. నేను బుక్ ఫెయిర్ కి రావడం ఇదే మొదటిసారి. ఇది మంచి అనుభవం నాకు. నేను తీసుకున్న తంబోరా బుక్స్ అన్నీ తెలుగులోనే తీసుకున్నాను. తెలుగులో చదవడం బావుంటుంది. తీసుకున్న పుస్తకాలన్నీ చదివేస్తే కొత్త పుస్తకాలను తీసుకునే ఆశక్తి కలుగుతుంది.

Untitled-13.jpg

2. కొండపల్లి రాజా శివేంద్ర

నేను రహమత్ నగర్ శాంతి విద్యానికేతన్ హైస్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇంగ్లీష్ మీడియం చదువుతున్నప్పటికీ.. తెలుగు చదవడం, రాయడం నాకు వచ్చు. మా అమ్మనాన్నలు, మా మామయ్య నాకు తెలుగు చదవడం నేర్పారు. హైదరాబాద్‌లో బుక్ ఎగ్జిబిషన్‌కి రావడం ఇదే మొదటిసారి. ఇన్ని పుస్తకాలను ఒకే చోట చూస్తుంటే చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంది. నాకు విక్రమ బేతాళ కథలంటే చాలా ఇష్టం. అలాగే గల్లీవర్ కథలన్నా కూడా చాలా ఇష్టం. ఇంక ప్రతి సండే న్యూస్ పేపర్స్‌తో పాటు వచ్చే బుక్స్ చదవడం అంటే చాలా చాలా ఇష్టం. మా అమ్మ చెప్పే కథలన్నీ నాకు ఇష్టమే. మహాభారతం, రామాయణాలను మా అమ్మ కథలుగా చెబుతుంటుంది. నన్ను కొనుక్కోమంటే మాత్రం.. చందమామ కథల పుస్తకాలన్నీ కొనుక్కోవాలని ఉంది. నా స్నేహితులకు కొంత మందికి మాత్రమే పుస్తకాలు చదివే అలవాటు ఉంది. అందులో చాలా మందికి తెలుగు చదవడం రాదు. నాకు తెలుగు చదవడం బాగా వచ్చు.

Untitled-14.jpg

3. జై శ్రీకర్

నేను 4వ తరగతి చదువుతున్నాను. నాకు తెలుగు చదవడం వచ్చు. మా అమ్మనాన్నలు నాకు నేర్పారు. బుక్ ఎగ్జిబిషన్‌కి రావడం ఇదే ఫస్ట్ టైమ్. చాలా బాగుంది. నాకు సాహస కథలంటే (అడ్వంచర్ స్టోరీస్) చాలా ఇష్టం. మా అన్నయ్య, నేను సండే న్యూస్ పేపర్స్‌తో పాటు వచ్చే బుక్స్‌లో పదవినోదంని పూర్తి చేస్తుంటాము. అలా మాకు చాలా విషయాలు తెలుస్తుంటాయి. మా అమ్మ మహాభారతం, రామాయణాలను కథలుగా చెబుతుంటుంది. అవంటే నాకు చాలా ఇష్టం. నన్ను కొనుక్కోమంటే మాత్రం.. సాహస కథల పుస్తకాలు, బొమ్మరిల్లు కథలు, ఇంకా నా స్టడీస్‌కు ఉపయోగపడే పుస్తకాలు కొనుక్కుంటాను. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినప్పటికీ.. మా స్కూల్‌లో తెలుగు బాగా నేర్పుతారు. మా ఫ్రెండ్స్ కూడా తెలుగు బాగానే చదువుతారు.

Untitled-7.jpg

4. ధృవన్విత

నేను చైతన్యా సెంట్రల్ స్కూల్ లో ఐదో తరగతి చదువుతున్నాను. రెండు మూడేళ్ళ నుంచి అమ్మానాన్న నన్ను బుక్ ఫెయిర్ కి తీసుకువస్తున్నారు. నాకు పుస్తకాలు చదవడం మీద ఇంట్రస్ట్, ఇంగ్లీష్ పుస్తకాలను చదవడంతో మొదలైంది. క్లాస్ లో ఇంగ్లీష్ లెసెన్స్ మాత్రమే ఉంటాయి కనుక తెలుగు తక్కువగా చదువడం వల్ల అంతగా రాదు. ఇంగ్లీష్ లో పంచతంత్ర కథలు నాకు నచ్చిన కథలు. ఇంకా చిన్నచిన్న స్టోరీస్ కూడా నాకు చాలా నచ్చుతాయి. ఇన్ని పుస్తకాలు ఈ బుక్ ఫెయిర్ లో చూడటం బావుంటుంది.

Untitled-15.jpg

5. సుదర్శన్ MBA

గత పదేళ్ళుగా బుక్ ఫెయిర్ కి వస్తూనే ఉన్నాను. కరోనా టైం తప్ప అసలు ఏ సంవత్సరం కూడా ఈ పుస్తకాల పండుగను మిస్ కాను. నేను చదివేవన్నీ ఇంగ్లీష్ పుస్తకాలే. తెలుగు మీద అంత ఆశక్తి ఉండదు. నా మాతృ భాష కన్నడా కానీ తెలుగు మాట్లాడటం వరకూ ఓకే. చదవడం అంతగా రాదు. ఎక్కువగా ఇక్కడకు ఫేమలీతో వస్తూ ఉంటాను. మా నాన్నగారు తెలుగు బాగా చదువుతారు. ఆయన చదవడానికే విశ్వనాథ సత్యనారాయణ గారి వేయిపడగలు పుస్తకం తీసుకున్నారు. నా స్నేహితుల్లో చాలామంది వాళ్ళ ఫోన్స్ లోనే పుస్తకాలు చదువుతారు. నేను ఇంగ్లీష్ నవెల్స్ చదవడానికి ఇష్టపడతాను. Methodology related, హిస్టరీ రిలేటడ్ పుస్తకాలను చదవడానికి ఫ్రిఫర్ చేస్తాను.

Untitled-8.jpg

6. సత్యమేథ్..

నేను పదోతరగతి చదువుతున్నాను. మలక్ పేట్ లో ఉంటాను. నేను మూడోసారి బుక్ ఎగ్జిబిషన్ కి వస్తున్నాను. ఇన్ని బుక్స్ చూడటం బావుంటుంది. Amish Tripathi బుక్స్ ఇంగ్లీష్ లో చదవడానికి ఇష్టపడతాను. తెలుగు అంతగా అలవాటు లేదు. Percy Jackson సిరీస్ బాగా ఇష్టం. ఈ బుక్స్ కథలు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఇందులో ఫిక్షన్ బుక్స్ ఇష్టం. తెలుగులో చదివితేనే మనకు కథల విషయంలో ప్రత్యేకంగా తెలిసేది ఏం ఉండదు అనుకుంటాను. ఇంగ్లీష్ లో కూడా భక్తి గురించి పురాణాల గురించి తెలుసుకునే వీలుంటుంది. నాకు కూడా చాలా పురాణ కథలు అలా చదివితేనే తెలిశాయి.

Untitled-12.jpg

7. రోహిత్

నేను పదోతరగతి తెలంగాణ సాంఘిక గురుకుల పాఠశాలలో చదువుతున్నాను. మొదటిసారి మా విద్యార్థులతో మా సార్ తో వచ్చాను. తెలుగు పుస్తకాలు మేము చదివేది తక్కువే. చదివినా హిస్టరీకి సంబంధించినవి, జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి ఎంచుకున్నాను. మా సొసైటీ వెల్ఫైర్ (Society Welfare) వాళ్ళే ఒక బుక్ స్టాల్ ఏర్పాటు చేసారు దానిలో కొన్ని పుస్తకాలు ఎంచుకున్నాను. ఇక్కడ ఇన్ని పుస్తకాలు చూడటం ఆనందంగా ఉంది.

Untitled-11.jpg

8. మనీష్

నేను పదోతరగతి తెలంగాణ సాంఘిక గురుకుల పాఠశాలలో చదువుతున్నాను. తెలినివాళ్ళ గురించి తెలుసుకోవాలని ఆసక్తి నాకు. ఎక్కువగా తెలుగు కన్నా ఇంగ్లీష్ చదవడానికి ఇష్టపడతాను. మొదటిసారి బుక్ ఫెయిర్ వస్తున్నట్టు అనిపించలేదు. మా ఫ్రెండ్స్ ని కూడా తీసుకురావాలనిపించేంత బావుంది.

Untitled-10.jpg

9. పవన్

నేను పదోతరగతి తెలంగాణ సాంఘిక గురుకుల పాఠశాలలో చదువుతున్నాను. నాకు బుక్ ఫెయిర్ కి రావడం సంతోషంగా ఉంది. ఇదే మొదటిసారి. ఇన్ని పుస్తకాలు ఒకచోట చూడటం బావుంది. చెట్టుతల్లి అనే తెలుగు కథల పుస్తకం కొనుక్కున్నాను. ఇంగ్లీష్ చదివేది తక్కువే. మనోరమ జీకే బుక్స్ తీసుకున్నాను. మళ్ళీ బుక్ ఫెయిర్ కి కూడా తప్పకుండా వస్తాను.

Untitled-9.jpg

10. శాంతి.

నేను ఇంటర్ చదువుతున్నాను. మూడనమ్మకాలు ఎం చెబుతున్నాయ్.. సైన్స్ ఎం చెబుతుంది అనేది తెలుసుకోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. అందుకే సైన్స్ బుక్స్ తీసుకున్నాను. తెలుగు చదువుతాను. మొదటిసారి పుస్తకాల ఎగ్జిబిషన్ కి వస్తున్నాను. నాకు నచ్చిన పుస్తకాలన్నీ ఎంచుకోవాలంటే రెండురోజులు పట్టేట్టు ఉంది. కానీ చాలా ఆనందంగా ఉంది. నా స్నేహితులతో ఇక్కడికి వచ్చాను.

-శ్రీశాంతి మెహెర్.

Updated Date - 2022-12-26T14:06:38+05:30 IST