SSMB28: సంక్రాంతి పండగ తరువాతే మహేష్ బాబు సినిమా

ABN , First Publish Date - 2022-12-05T16:35:33+05:30 IST

మహేష్ బాబు మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ మొదట అనుకున్నట్టుగా డిసెంబర్ రెండవ వారం నుండి జరగటం లేదు అని తెలిసింది.

SSMB28: సంక్రాంతి పండగ తరువాతే మహేష్ బాబు సినిమా
File picture of Trivikram and Mahesh Babu

మహేష్ బాబు మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ మొదట అనుకున్నట్టుగా డిసెంబర్ రెండవ వారం నుండి జరగటం లేదు అని తెలిసింది. (Mahesh Babu and Trivikram Srinivas combination film shoot again postponed) ఈ సినిమా షూటింగ్ మొదలెట్టిన దగ్గర నుండి ఏవేవో అవాంతరాలు వస్తూనే వున్నాయి. మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారు కొన్ని వారాల వ్యత్యాసం లో పరమపదించటం తో మహేష్ కొన్ని నెలలు షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది. (Mahesh Babu's parents Indira Devi and Super Star Krishna, both passed away in between, so the shoot postponed).

ఈ సినిమా షూటింగ్ ఒక యాక్షన్ సన్నివేశంతో మొదలెట్టిన, కేవలం ఆరు రోజులు మాత్రమే చేశారు. తరువాత మహేష్ బాబు కి ఆ యాక్షన్ దర్శకులకి సరిగ్గా కుదరలేదు అని మహేష్ షూటింగ్ చెయ్యలేదని ఒక వార్త అప్పట్లో నడిచింది. అంతే ఆ ఆరు రోజులు మాత్రమే షూటింగ్ అయింది ఇంతవరకు. ఇప్పుడు డిసెంబర్ వచ్చేసింది సినిమా మళ్ళీ ఫ్రెష్ గా మొదలెట్టాలి అని, ఇంక ఎప్పటికి పూర్తి అవుతుందో అని దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగ వంశీ చాల ఆందోళనలో వున్నట్టుగా తెలిసింది. (They want to start from December second week, but now postponed after Sankranthi festival in January next year)

MB-Trivikram2.jpg

ఎందుకంటే ఈ సినిమా తరువాత మహేష్ బాబు ఇంకో సినిమా రాజమౌళి తో వచ్చే సంవత్సరమే మొదలెట్టాలి. ఒకవేళ ఈ సినిమా చేస్తూ ఆ సినిమా మొదలెడితే కనక, త్రివిక్రమ్ సినిమా ఇంకా బాగా లేట్ అయ్యే ఛాన్స్ వుంది. అందుకని తొందరగా చేద్దాం అనుకున్నా ఏవో ఒక అవాంతరం వస్తూనే వుంది. అదీ కాకా, పూజ హెగ్డే కాలు విరిగి ఇంట్లో కూర్చుంది కొన్నాళ్ళు. కానీ ఆమె వుండే సన్నివేశాలు ఇప్పుడు తీయాలని అనుకోలేదు, అందువల్ల ఆమె వాళ్ళ షూటింగ్ జరగలేదు అని అనలేరు అని ఒక టాక్ కూడా నడుస్తోంది. (Director Trivikram and producer Naga Vamsi both are in tension because of this film) ఇప్పుడు షూటింగ్ ఏకంగా సంక్రాంతి తరువాత పెట్టుకుందాం అని మహేష్, త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారు. అంటే జనవరి మూడో వారం లో మొదలవుతుంది. మధ్యలో మళ్ళీ అవాంతరాలు ఏమి రాకుండా ఉంటే, షూటింగ్ ఆరు నెలల్లో చెయ్యగలరా? అదీ ఇప్పుడు ప్రశ్న. లేదంటే వచ్చే సంవత్సరం అంతా ఈ సినిమా అవుతుందా? ఏమో పెట్టిన ముహూర్తం బట్టి సరిగ్గా అవుతున్నట్టు అయితే కనిపించటం లేదు. (Pooja Hegde is not available in between as her leg fractured)

Updated Date - 2022-12-05T16:35:35+05:30 IST