Mahesh Babu: మహేష్ బాబు ఫోన్, త్రివిక్రమ్ షాక్ ఇంతకీ విషయం ఏంటి అంటే

ABN , First Publish Date - 2022-11-18T13:17:03+05:30 IST

మహేష్ దగ్గర నుండి దర్శకుడు త్రివిక్రమ్ కి ఫోన్ వచ్చింది అని తెలిసింది. ఫోన్ లో మహేష్ బాబు షూటింగ్ మొదలెట్టేద్దాం అని చెప్పగానే త్రివిక్రమ్ షాక్ అయ్యడాని తెలిసింది.

Mahesh Babu: మహేష్ బాబు ఫోన్, త్రివిక్రమ్ షాక్ ఇంతకీ విషయం ఏంటి అంటే
File photo of Trivikram and Mahesh Babu

మహేష్ బాబు కి ఇది చాలా గడ్డు సమయం, ఎందుకంటే అన్నయ్యని పోగొట్టుకొని సంవత్సరం తిరగకముందే, కొన్ని నెలల వ్యవధిలో తల్లిని, తండ్రిని పోగొట్టుకున్నాడు. పుట్టెడు దు:ఖంలో వుండి కూడా దిగమింగుకొని పరామర్శకి వచ్చిన వాళ్ళని అందరినీ ఆదరంగా మాట్లాడుతూనే వున్నాడు. అయితే తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసి వచ్చిన మరునాడు, అంటే గురువారం, మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఫోన్ చేశాడని తెలిసింది. త్రివిక్రమ్ తో మహేష్ బాబు సినిమా ఒక ఆరు రోజులు మాత్రమే షూటింగ్ చేసిన తరువాత మహేష్ తల్లి ఇందిరా దేవి పరమపదించటంతో షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ తండ్రి కృష్ణ గారు కూడా దూరం అవటంతో షూటింగ్ ఇంకా ఎప్పుడు మొదలు పెడదాం అనే విషయం నిర్మాత వంశీ కి, దర్శకుడు త్రివిక్రమ్ కి అసలు తెలియటం లేదు. అదీ కాకుండా, అసలే తల్లీ తండ్రి పోయిన విచారం లో వున్న మహేష్ ని ఆడగలేరు కూడా. ఎప్పుడు మహేష్ అంటే అప్పుడు చేద్దాం అని అనుకుంటున్న సమయంలో మహేష్ దగ్గర నుండి దర్శకుడు త్రివిక్రమ్ కి ఫోన్ వచ్చింది అని తెలిసింది. ఫోన్ లో మహేష్ బాబు షూటింగ్ మొదలెట్టేద్దాం అని చెప్పగానే త్రివిక్రమ్ షాక్ అయ్యడాని తెలిసింది. మహేష్ బాబు తాను చేయబోయే సినిమా గురించి మాట్లాడుతుంటే, త్రివిక్రమ్ ఇప్పుడు ఎందుకు లెండి, ముందు కార్యక్రమాలు అవనీయండి అని చెప్పాడట. కానీ మహేష్ మాత్రం డిసెంబర్ 8 నుండి షూటింగ్ పెట్టుకోండి, నేను రెడీ అప్పటికి అని చెప్పాడట. (Mahesh Babu to resume shooting for director Trivikram Srinivas film from December 8, says a source) తండ్రి 11వ రోజు కార్యక్రమాలు అన్నీ ఈనెల చివరి వారం లో పూర్తి చేసేసి, ఒక వారం పాటు రెస్ట్ తీసుకొని డిసెంబర్ 8 నుండి షూటింగ్ చేసేద్దాం అని మహేష్ ఫోన్ లో చెప్పగానే త్రివిక్రమ్ షాక్ అయ్యడాని తెలిసింది. అసలు వాళ్ళకి కి కూడా ఏమి ఆనాలో తెలియటం లేదు అని కూడా తెలిసింది. మహేష్ అలా అనగానే నిర్మాత, దర్శకులు ఇప్పుడు ఆ షూటింగ్ సన్నాహాల్లో వున్నారని కూడా తెలిసింది. హైదరాబాద్ లో షూటింగ్ చేస్తారని తెలిసింది. మొదట యాక్షన్ సన్నివేశాలతో మొదలెట్టినా, ఇప్పుడు మామూలు సాఫ్ట్ సన్నివేశాలు చిత్రీకరించే యోచనలో వున్నట్టు తెలిసింది. #MaheshBabu #SSMB #SSMB28 #TrivikramSrinivas #SuperStarKrishnaLivesOn

Updated Date - 2022-11-18T13:17:09+05:30 IST