మూడేళ్ల క్రితం పెళ్లి.. ఓ స్పా సెంటర్ ముందు ఆ భర్త ఎందుకు పెట్రోల్ పోసుకుని మరీ నిప్పంటించుకున్నాడంటే..
ABN , First Publish Date - 2022-12-17T17:00:46+05:30 IST
ప్రేమ వివాహాలు చేసుకున్న వారు జీవితాంతం అదే ప్రేమను కనబరుస్తూ ఆనందంగా ఉంటారు. అయితే కొంతమంది మాత్రం చేజేతులా సంసారాలను నాశనం చేసుకుంటుంటారు. రాజస్థాన్‌లో..
ప్రేమ వివాహాలు చేసుకున్న వారు జీవితాంతం అదే ప్రేమను కనబరుస్తూ ఆనందంగా ఉంటారు. అయితే కొంతమంది మాత్రం చేజేతులా సంసారాలను నాశనం చేసుకుంటుంటారు. రాజస్థాన్‌లో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట విషయంలో ఇలాగే జరిగింది. మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇటీవల ఓ స్పా సెంటర్ ముందు ఆ భర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటంటే..
దుకాణదారుడి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చిన యువతి.. విషయం తెలుసుకుని బకెట్‌తో నీళ్లు చల్లడంతో..
రాజస్థాన్ (Rajasthan) బార్మర్ జిల్లా పరిధి బలోత్రా ప్రాంతానికి చెందిన రాకేష్.. ఉపాధి నిమిత్తం మూడేళ్ల క్రితం డార్జిలింగ్ వెళ్లాడు. అక్కడ స్పా సెంటర్లో (Spa center) పని చేస్తున్న ఆర్తి అనే యువతితో పరిచయం ఏర్పడింది. తర్వాత కొన్నాళ్లకు ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. తర్వాత ఆమెను బలోత్రాకు తీసుకొచ్చాడు. కొంతకాలం సహజీవనం (Live in relationship) చేసిన తర్వాత వివాహం చేసుకున్నాడు. అయితే తర్వాత రాకేష్.. ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. దీంతో వారి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు (Financial difficulties) ఎక్కువయ్యాయి. దీంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కొన్ని నెలల క్రితం ఆర్తి.. జోధ్‌పూర్‌కు వచ్చింది. దీంతో అప్పటి నుంచి రాకేష్ తన భార్య కోసం వెతుకుతూ ఉన్నాడు.
పెళ్లయిన మర్నాడే షాకింగ్ ఘటన.. పాడు పని చేస్తూ భార్యకు అడ్డంగా దొరికిపోయిన భర్త.. చివరకు..
ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. తన భార్య జోధ్‌పూర్‌లో ఉన్న ఓ స్పా సెంటర్లో పని చేస్తున్నట్లు ఇటీవల రాకేష్‌కు తెలిసింది. దీంతో అక్కడికి వెళ్లి ఆమెను కలిసి, ఇంటికి రావాలని కోరాడు. అయితే ఆమె ఇందుకు నిరాకరించింది. ఇటీవల ఓ రోజు మళ్లీ ఆమె వద్దకు వెళ్లి.. ఇంటికి రావాలని పట్టుపట్టాడు. అయినా ఆమె ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. వెంట తీసుకెళ్లిన పెట్రోల్‌ను మీద పోసుకుని.. అందరి ముందు (suicide attempt) నిప్పంటించుకున్నాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. తర్వాత మంటలను ఆర్పేసి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సుమారు 60శాతం కాలిన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ఖాళీగా ఉండడంతో పాటూ తనను చిత్రహింసలకు గురి చేసేవాడని, అందుకే విడిచిపెట్టి వచ్చేశానని ఆర్తి.. పోలీసుల విచారణలో తెలియజేసింది. ఈ ఘటనపై ఇప్పటి వరకూ ఎలాంటి కేసూ నమోద చేయలేదు.