Gold Stock End’s: బంగారానికి వార్నింగ్ బెల్స్.. 20 ఏళ్ల తర్వాత బంగారం కనిపించదు..!?

ABN , First Publish Date - 2022-12-13T15:38:54+05:30 IST

భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. మార్కెట్ లో ధర ఎంత ఉన్నా బంగారం కొనుగోళ్ళు జరుగుతూనే ఉంటాయి. వాటికి తగ్గట్టు ఎన్నోరకాల డిజైన్లు కొనుగోలుదారులను ఇట్టే..

Gold Stock End’s: బంగారానికి వార్నింగ్ బెల్స్.. 20 ఏళ్ల తర్వాత బంగారం కనిపించదు..!?

భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. మార్కెట్ లో ధర ఎంత ఉన్నా బంగారం కొనుగోళ్ళు జరుగుతూనే ఉంటాయి. వాటికి తగ్గట్టు ఎన్నోరకాల డిజైన్లు కొనుగోలుదారులను ఇట్టే ఆకర్షిస్తాయి. అయితే బంగారం గురించి ఎవరూ ఊహించని ఓ విషయాన్ని అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటించింది. బంగారం ప్రియులను ఆ విషయం చాలా కలవరపెడుతోంది. ఇంతకూ నాసా ఏం చెప్పిందంటే..

బంగారం భూమిలో గనులలో దొరికే ఖనిజమని అందరికీ తెలిసిందే.. బంగారాన్ని నచ్చినట్టు తవ్వేయడం వల్ల బంగారు గనులు క్రమంగా తగ్గిపోతున్నాయట. ఈ కారణంగా బంగారానికి కొరత ఏర్పడుతుందని సమాచారం. ఈ కొరత పూడ్చడానికి బంగారపు గనుల కోసం అంతరిక్షంలో వేట మొదలుపెట్టారట. అయితే ఇంకొక 20సంవత్సరాలు ఉంటే బంగారం కనుమరుగైపోతుని చెబుతున్నారు విశ్లేషకులు.. ఇంతకూ 20 ఏళ్ళ తరువాత బంగారం కథేంటి బంగారాన్ని మనం చూడలేమా వంటి ఆసక్తికరమైన విషయాలలోకి వెళితే..

gold.jpg

ప్రపంచలో ప్రతి దేశం ఆర్థిక పరిస్థితి ఆ దేశంలో ఉన్న బంగారు గనుల మీద ఆధారపడి ఉంటుంది. దేశాల ఆర్థిక స్థితులను ప్రభావం చేసేంత శక్తివంతమైన ఖనిజం బంగారం. అయితే ఇప్పటికి ప్రపంచంలో సుమారు 2లక్షల టన్నులకు పైగా బంగారాన్ని భూగర్భంలో నుండి తవ్వేశారట. ప్రస్తుతం కేవలం 50వేల టన్నుల బంగారం మాత్రమే భూమిలో నిల్వ ఉన్నట్టు పరిశధనలలో తేలింది. ఇది పూర్తిగా ఖచ్చితమైన లెక్క కానప్పటికి భూగర్భంలో బంగారం గనులు ఇప్పటికే చాలా శాతం కనుమరుగయ్యాయి. అందుకే బంగారం గనుల కోసం అంతరిక్షంలో కూడా వేట మొదలుపెట్టారు.

అంతరిక్షంలో బుధుడు, అంగారక గ్రహాల మధ్య ఒక ఉల్క ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాని పేరు సైక్-16 అని తెలిపారు. ఈ గ్రహం బంగారం, ప్లాటినం, నికెల్, ఇనుము మొదలయిన ఖనిజాలతో నిండిపోయి ఉంటుందట. ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ధనవంతులను చేయగలిగినంత బంగారం ఆ గ్రహంలో ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.

భూమి మీద ఉన్న బంగారం కోసం భవిష్యత్తులో యుద్దాలు కూడా జరగవచ్చని అభిప్రాయపడుతున్నారు. బంగారాన్ని కేవలం ధనవంతుల దగ్గర తప్ప ఇంకెవరిదగ్గరా చూడలేమని స్పష్టం చేశారు. ఇతర గ్రహాల నుండి బంగారాన్ని తెచ్చినా దానికున్న విలువ కారణంగా సామాన్యులకు అందుబాటులో ఉండదని పేర్కొంటున్నారు. అందుకే సామాన్యుల దగ్గర బంగారముంటే దాచుకోవాలి. ఎందుకంటే తరువాత బంగారమనే ఓ ఖనిజం ఉండేది అని పిల్లలకు పాఠాల రూపంలో చెప్పాల్సివస్తుంది.

కాగా ప్రస్తుతం అన్నిచోట్లా ఏటియం లు ఉన్నట్టుగా బంగారం కోసం హైదరాబాదులో గోల్డ్ ఏటియం పెట్టారు. ఇందులో వివిధ పరిమాణాలలో బంగారు నాణేలు పొందవచ్చట. బంగారమంటే పడిచచ్చిపోయే సగటు గృహిణి రాబోవు కాలంలో కేవలం కలల్లో మాత్రమే బ్రతకాల్సి వస్తుందేమో..

Updated Date - 2022-12-13T15:45:48+05:30 IST