Viral Video: వీడు మనిషా.. కాదా..! కారు పక్కన నిలబడ్డ పాపానికి.. చిన్నారిని ఏకంగా..

ABN , First Publish Date - 2022-11-04T18:25:48+05:30 IST

కొందరు మనిషి రూపంలో ఉన్న రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు. కనీస జాలి కూడా చూపకుండా.. చిన్నా పెద్దా, ఆడ, మగా అన్న తేడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. కేరళలో ఇలాంటి శాడిస్టుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది...

Viral Video: వీడు మనిషా.. కాదా..! కారు పక్కన నిలబడ్డ పాపానికి.. చిన్నారిని ఏకంగా..

కొందరు మనిషి రూపంలో ఉన్న రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు. కనీస జాలి కూడా చూపకుండా.. చిన్నా పెద్దా, ఆడ, మగా అన్న తేడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. కేరళలో ఇలాంటి శాడిస్టుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. కారు పక్కన నిలబడ్డ పాపానికి ఓ చిన్నారి పట్ల రాక్షసంగా ప్రవర్తించాడు. అతడి ప్రవర్తించిన తీరును చూసిన.. ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. కారు యజమానిపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

Viral Video: మనుషులు మెసేజ్ చేయడం మామూలే.. కానీ చిలుక చాటింగ్ చేయడం ఎప్పుడైనా చూశారా..

కేరళలోని (Kerala) కన్నూర్‌ పరిధి తలస్సేరిలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని రోడ్డు పక్కన ఓ వ్యక్తి కారు పార్కు చేసి ఉన్నాడు. ఆ సమయంలో ఓ బాలుడు.. అటుగా వెళ్లి కారు పక్కన నిలబడి ఉన్నాడు. కాసేపటికి కారు యజమాని అటుగా వచ్చి.. పిల్లాడిని గమనిస్తాడు. నా కారుకు ఆనుకుని నిలబడతావా... అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాలితో గట్టిగా తన్నాడు. దీంతో బాలుడు దూరంగా పడ్డాడు. ఈ దాడిలో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. అక్కడే ఉన్న కొందరు యువకులు గమనించి.. అక్కడికి వెళ్లి కారు యజమానిని నిలదీస్తారు. దీంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Viral Video: సినిమా స్టైల్లో డ్యాన్స్ వేయాలని భార్యను ఎత్తుకున్న భర్త.. చివరకు అందరి ముందూ..

అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సదురు వ్యక్తిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే కాసేపటికే విడిచిపెట్టడంతో పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి, స్పీకర్, తలస్సేరి ఎమ్మెల్యే ఏఎన్ శ్యాంసీర్ స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారి ఆదేశాల మేరకు.. నిందితుడిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. కారు యజమానిని కఠినంగా శిక్షించాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

దోశలు వేస్తూ ఏడాదికి రూ.50 లక్షల సంపాదన.. బీకామ్‌కు మధ్యలోనే గుడ్ బై చెప్పి మరీ..

Updated Date - 2022-11-04T18:28:06+05:30 IST