రెండు నెలల చిన్నారిది సాధారణ మరణమేనని తల్లిదండ్రులు చెప్పినా కోర్టు నమ్మలేదు.. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు..!
ABN , First Publish Date - 2022-12-16T17:47:18+05:30 IST
భార్యాభర్తల మధ్య తలెత్తే గొడవలకు కొన్నిసార్లు పిల్లలు బలవుతుంటారు. మరికొన్నిసార్లు ఒకరిమీద మరొకరి కోపాన్ని.. చివరకు పిల్లల మీద చూపిస్తుంటారు. ఈ క్రమంలో..
భార్యాభర్తల మధ్య తలెత్తే గొడవలకు కొన్నిసార్లు పిల్లలు బలవుతుంటారు. మరికొన్నిసార్లు ఒకరిమీద మరొకరి కోపాన్ని.. చివరకు పిల్లల మీద చూపిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లలను చిత్రహింసలకు గురి చేయడం తరచూ చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దంపతులు కూడా దాదాపు ఇలాగే చేశారు. రెండు నెలల చిన్నారిది సాధారణ మరణమేనని తల్లిదండ్రులు చెప్పినా కోర్టు నమ్మలేదు. చివరకు పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..
ఇలాంటి పని చేయడానికి ఎలా మనసొచ్చిందమ్మా.. 10 రోజుల క్రితమే పుట్టిన పాపను ఎముకలు కొరికే చలిలో..
ఇంగ్లండ్‌లోని లివర్‌పూర్ (Liverpool) పరిధిలో 2020లో జరిగిన ఈ ఘటనపై కోర్టులో విచారణ (Court hearing) చివరి దశకు చేరుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన దంపతుల (couple) మధ్య కరోనా లాక్‌డౌన్ సమయంలో గొడవలు తలెత్తాయి. నిద్రలేమి, శృంగారానికి సంబంధించిన సమస్యలు, మానసిక ఒత్తిడి (mental stress) కారణంగా భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో తమ రెండు నెలల చిన్నారిని (two month old baby) నిర్లక్ష్యం చేశారు. ఓ రోజు బాబు ఇంటి పెరట్లో ఉన్న తొట్టి ఉయ్యాలో పడుకుని ఉన్నాడు. ఆ సమయంలో దంపతుల మధ్య మళ్లీ గొడవ జరిగింది. మరోవైపు ఊయల్లో ఉన్న చిన్నారి.. చాలా సేపటి నుంచి ఊపిరాడక ఇబ్బంది పడుతున్నాడు. ఇద్దరూ పట్టించుకోకపోవడంతో చివరకు చిన్నారి మృతిచెందాడు.
అర్ధరాత్రి ఓ ఇంట్లోకి దూరాడో దొంగ.. అలికిడికి నిద్రలేచిన మహిళ.. చివరకు ఊహించని సీన్..!
తర్వాత గమనించి తల్లిదండ్రులు.. పోలీసులకు ఫోన్ చేసి, తమ కొడుకు పడక గదిలో ఉండగా ప్రమాదవశాత్తు చనిపోయాడని చెప్పారు. అయితే వారి ఇంటికి చేరుకున్న పోలీసులు.. పరిసరాలు మొత్తం పరిశీలించారు. ఈ క్రమంలో పెరట్లో తొట్టిని గమనించారు. దీంతో అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కోర్టులో విచారణ జరుగుతోంది. తల్లిదండ్రులు మాత్రం తమ కొడుకుది సాధారణ మరణమని వాదిస్తూ వచ్చారు. తాజాగా, మళ్లీ ఈ కేసుపై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. పోలీసులు సమర్పించిన సాక్షాధికారాలను న్యాయమూర్తులు పరిశీలించారు. చివరకు తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతి చెందిందని తేల్చారు. అయితే ఈ కేసులో దోషులుగా ఉన్న తల్లిదండ్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.