RC15: చెర్రీ లుక్ అదిరింది!
ABN , First Publish Date - 2022-11-27T20:37:31+05:30 IST
రామ్ చరణ్ స్టన్నింగ్ లుక్‌లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వలో తెరకెక్కుతున్న ‘ఆర్సీ 15’ షూటింగ్ నిమిత్తం న్యూజీలాండ్‌లో ఉన్నారు. తాజాగా రామ్ చరణ్ కొత్త లుక్‌ను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
రామ్ చరణ్ (Ram charan) స్టన్నింగ్ లుక్‌లో (Stunning look) దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఆయన శంకర్ (Shankar direction)దర్శకత్వలో తెరకెక్కుతున్న ‘ఆర్సీ 15’ (Rc15 shoot) షూటింగ్ నిమిత్తం న్యూజీలాండ్‌లో ఉన్నారు. తాజాగా రామ్ చరణ్ కొత్త లుక్‌ను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘స్టిల్ ఇన్ థాట్స్’ (Still in Thoughts)అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. చరణ్ లుక్ చూసి బాలీవుడ్ బ్యూటీ కట్రీనా కైఫ్, ఆది పినిశెట్టి, డబు రత్నాని వంటి సెలబ్రిటీలు లైక్ చేశారు. లుక్ అదరింది అంటూ మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూర్తిస్థాయి పొలిటికల్ డ్రామాగా రూపొందనుంది. ఇందులో రామ్‌చరణ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. కార్తిక్ సుబ్బరాజు కథ అందించగా తమన్ స్వరాలు అందిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర ఇతర పాత్రధారులు.