Home » Dil raju
CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని మంచు మోహన్‌బాబు, విష్ణు కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మోహన్‌బాబు, విష్ణు రేవంత్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సినీ నిర్మాత దిల్ రాజ్‌ను ఐటీ అధికారులు రెండు గంటలపాటు ప్రశ్నించారు. విచారణకు ఎప్పుడూ పిలిచినా రావాలని సూచించారు.
Dil Raju: తెలుగు చిత్ర పరిశ్రమ నిర్మాత దిల్ రాజు విచారణ నిమిత్తం ఐటీ కార్యాలయానికి వచ్చారు. రెండు గంటల పాటు ఆయనను విచారించనుంది ఐటీ. ఇటీవల నాలుగు రోజుల పాటు దిల్‌రాజు నివాసంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
Dil Raju: కొన్ని ఛానెల్స్, సోషల్ మీడియాలో మా వద్ద డబ్బు డాక్యుమెంట్స్ దొరికాయని వార్తలు వేశారని.. కానీ రూ.20 లక్షలలోపు మాత్రమే ఉన్నాయని దిల్ రాజు తెలిపారు. ఐదు సంవత్సరాల నుంచి తాము ఎక్కడా ఇన్వెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. అంతా క్లీన్‌గా ఉందని.. డిపార్ట్‌మెంట్ వారు ఆశ్చర్యపోయినట్లు ఆయన అన్నారు.
ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారుల సోదాలు వరుసగా నాలుగోరోజు కొనసాగాయి.
Dil Raju: నాలుగు రోజుల పాటు జరిగిన ఐటీ సోదాల్లో కీలక అంశాలను గుర్తించారు. వచ్చిన లాభాలకు కట్టిన ట్యాక్స్‌కు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. అలాగే సంక్రాంతికి వచ్చిన సినిమాల కలెక్షన్లపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. దిల్‌రాజు ఇంట్లో కీలక పత్రాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. దిల్‌రాజు కార్యాలయంలో కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
Dil Raj: టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఐటీ అధికారులపై దిల్ రాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Dil Raju : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో మూడో రోజు ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు కొనసాగుతోన్నాయి. అలాంటి వేళ.. కీలక పత్రాలను ఐటీ శాఖ ఉన్నతాధికారి పరిశీలిస్తు్న్నారు. ఆ సమయంలో ఆమెకు ఆయన వాదనకు దిగారు.
సినీ రంగానికి చెందిన ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు రెండోరోజైన బుధవారం కూడా సోదాలు కొనసాగించారు. 55 బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో సోదాలు జరిపారు.
IT Raids: మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ లావాదేవీలను ఇన్‌కంటాక్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. దిల్ రాజ్ (Producer Dil Raju) ఇల్లు, కూతురు హన్సితా రెడ్డి, సోదరుడు నర్సింహ రెడ్డి, నిర్మాత శిరీష్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రెండు మూవీల ఆదాయ వ్యయాలపైనా ఐటీ విచారణ చేస్తోంది.