Mega Star: బాస్ పార్టీ సాంగ్ కి షాకింగ్ దిల్ రాజు డాన్స్ చూసారా

ABN , First Publish Date - 2022-11-23T18:49:07+05:30 IST

ఒక సరదా వీడియో ఇప్పుడు ఒకటి వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియో లో డాన్స్ చేస్తున్నది ఎవరో తెలుస్తే షాక్ అవుతారు.

Mega Star: బాస్ పార్టీ సాంగ్ కి షాకింగ్ దిల్ రాజు డాన్స్ చూసారా
A still from 'Waltair Veerayya'

మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన 'వాల్తేరు వీరయ్య ' (Waltair Veerayya) సినిమా నుండి 'బాస్ పార్టీ' (Boss Party Song) సాంగ్ విడుదల అయిన కొన్ని గంటల్లోనే సాంఘీక మాధ్యమాల్లో ఉర్రూత లూగిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ పాట మీద మీమ్స్ (Mems) కూడా వెంట వెంటనే సాంఘీక మాధ్యమాల్లో పెట్టేసారు. ఆలా పెట్టిన ఒక సరదా వీడియో ఇప్పుడు ఒకటి వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియో లో డాన్స్ చేస్తున్నది ఎవరో తెలుస్తే షాక్ అవుతారు. సాక్షాత్తూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Popular producer Dil Raju dances for Boss Party song). దిల్ రాజు ఎప్పుడూ ఎక్కడా అంతలా డాన్స్ చెయ్యలేదు. కానీ అతని నిర్మాతగా 'హలో గురు ప్రేమ కోసమే' అనే సినిమాని రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్ జంటగా తీసిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు ఆ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు చేసిన డాన్స్ ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి 'బాస్ పార్టీ' సాంగ్ కి జతచేసి వేశారు. ఈ వీడియో వైరల్ గా ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో తిరుగుతోంది.

దిల్ రాజు డాన్స్ స్టెప్పులకి ఈ బాస్ పార్టీ సాంగ్ సరిగ్గా సరిపోయింది. ఆ వీడియో లో ఈ రెండూ మిక్స్ చేసి చేసిన అతనికి మంచి ఐడియా వచ్చిందనే చెప్పాలి. ఈ వీడియో కి లైక్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఏమయినా దిల్ రాజు షాకింగ్ డాన్స్ చూసి అందరూ పగలబడి నవ్వుతున్నారు.

Updated Date - 2022-11-23T20:00:28+05:30 IST